చిరు ఎంట్రీపై బన్నీ ఎందుకు స్పందించలేదు..?, కారణం అదేనా..?

Update: 2020-03-26 09:00 GMT
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్ - ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలను ప్రారంభించారు. ఈ ఖాతాలను ప్రారంభించిన 24 గంటలలోపే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను సంపాదించారు. @KChiruTweets పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ ను ప్రారంభించిన చిరంజీవి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశారు. ప్రారంభించిన 24 గంటలలోపే చిరంజీవి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటేసింది. అలాగే @chiranjeevikonidela పేరుతో ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్‌ ను ప్రారంభించి తల్లితో దిగిన ఫొటోను మొదట పోస్ట్ చేశారు. చిరంజీవి ఇన్‌ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షలకు చేరువగా ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా చిరంజీవి తన స్టామినాను చాటుతున్నారని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో చిరు ఎంట్రీపై టాలీవుడ్ స్టార్లు అందరూ స్పందిస్తూ మెగాస్టార్ కి వెల్కమ్ చెప్పారు. నాగార్జున - మహేష్ బాబు - మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు చిరంజీవి ట్వీట్ ని కోట్ చేస్తూ స్వాగతం పలికారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై మెగా అభిమానులు బన్నీపై గుర్రుగా ఉన్నారని సమాచారం. గతంలో కూడా సైరా నరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు బన్నీ దీనిపై స్పందించలేదు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా హీరోలు షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నారు. మరి ఖాళీగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకు స్పందించలేదనే విషయం సందేహం కలిగించేలా చేస్తున్నది. ఈ విషయమే మెగా ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు.

చిరంజీవి వల్లనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బన్నీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన చిరుకి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. కానీ బన్నీ చేయకపోవడంతో వీరి మధ్య గొడవలు వచ్చి దూరం పెరిగిందా అంటూ ఇండిస్ట్రీలో కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News