మెగా పవర్ స్టార్ కరామ్ చరణ్ కు 2022 వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు. ఎందుకన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించిన చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. స్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇద్దరు హీరోల అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ వారి కలని నిజం చేసింది. ఈ మూవీకి ఎలాంటి ఫలితమైతే రావాలని ఆశించారో అంతకు మించిన రిజల్ట్, అంతకు మించిన కలెక్షన్స్ ని ఈ మూవీ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఈ మూవీ హవా కొనసాగుతోంది. దీంతో బాలీవుడ్ తారలతో పాటు క్రిటిక్స్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మరింత స్పెషల్ గా మారబోతోందని తెలిసింది. గతంలో ఏడాదికి రెండు చిత్రాల్లో నటించని రామ్ చరణ్ ఈ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలా ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది చరన్ కెరీర్ లో ఇదే తొలిసారి. 'చిరుత'సినిమాతో కెరీర్ ప్రారంభించిన చరణ్ ఇప్పటి వరకు కెరీర్ లో ఏడాది ఒక్క సినిమా మాత్రమే ఇస్తూ వచ్చారు.
అయితే తొలిసారి ఈ ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలని అందిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ ఇదే ఏడాది 'ఆచార్య'తో మరోసారి ప్రేక్షకులని పలకరించబోతున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇది అతిథి పాత్ర కాదని అంతకు మించే వుంటుందని మేకర్స్ చెబుతున్నారు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో సిద్ధా అనే నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించబోతున్నారు. పూజా హెగ్డే చరణ్ కు జోడీగా నటించింది. ఇందులో మరో విశేషం ఏంటంటే ట్రిపుల్ ఆర్ లో తనకు కలిసి రాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న చరణ్ 'ఆచార్య'లో అందుకు భిన్నంగా వుంటే నక్సలైట్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.
ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇందులో చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందని, సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే చరణ్ కు 2022 నిజంగా వెరీ వెరీ స్పెషల్ ఇయర్‌గా నిలవడం ఖాయం.