మొన్నటి వరకు ఐపీఎల్ టోర్నీతో ఉత్సాహంగా గడిపిన క్రికెట్ ప్రియులకు త్వరలోనే మరో పండుగ రాబోతుంది. టీ20 ప్రపంచ కప్ యుద్ధానికి క్రీడాకారులు సిద్ధం అవుతుండడంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టీ 20-2021 ప్రపంచ కప్ యూఏఈ, ఒమన్లో జరగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ కప్ కోసం అర్హత సాధించిన జట్లు సోమవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈనెల 23 నుంచి టోర్నీ ప్రారంభ కానుంది. అయితే ఈసారి భారత్ తో దాయాది దేశం మొదట్లోనే తలపడనుంది. ఈనెల 24న ఇండియా, పాకిస్తాన్ తో ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కప్ ఏదైనా భారత్, పాక్ మ్యాచ్ అంటే ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా చూస్తాయి. ఇక ఈ రెండు దేశాల్లోని అభిమానులు ఎలాంటి ఆశలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్ కంటే భారత్ తో జరిగే పాకిస్తాన్ మ్యాచ్ పై నే అందరి దృష్టి ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ పై ఇరు దేశాల్లోని ప్రజలపై ప్రభావం కూడా ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. ఇలాంటి మ్యాచ్ ఈనెల 24న జరగనుంది.
ఈ నేపథ్యంలో రెండు దేశాల జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. 2011లో కప్ గెలుచుకున్న ఇండియా అప్పటి నుంచి ఫైనల్ వరకు వెళ్తున్న కప్ రాలేదు. దీంతో ఈసారి ఎలాగైన టైటిల్ గెలుచుకోవాలని తాపత్రయపడుతోంది. ఈనేపథ్యంలో క్రీడాకారులు అందుకు తగ్గట్లుగా కసరత్తు చేస్తున్నారు. ఆదివారం క్యాలిఫై మ్యాచ్ లు ప్రారంభం కాగా.. ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుతున్నారు. విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఇదే చివరి టోర్నీ కావడంతో ఆయన అభిమానులు కప్ పై ఆశలు విపరీతంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుదేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోని క్రీడాభిమానులు ఆసక్తిగా చూస్తారు. కానీ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఆమె భర్త సోయబ్ మాలిక్ పాకిస్తాన్ జట్టులో ప్లేయర్ కావడమే. అయితే భారత్ -పాక్ మ్యాచ్ జరుగుతున్న ప్రతీసారి సోషల్ మీడియాలో ఆమెను కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. 2010లో ఆమె వివాహం జరగగా ఆమె పెళ్లిన హైదరాబాద్లో కొందరు వ్యతిరేకించారు కూడా. అప్పటి నుంచి సానియా మీర్జాను ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు.
అయితే ఈసారి ఆ తల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ముందే జాగ్రత్త పడింది. ఈనెల 24న తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలిపింది. అందుకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏడు సెకండ్గు గల ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే రోజు చెడు వాతావరణం నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా’అని రెండు ఎమోజీలను కూడా జోడించింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో కొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
సోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ప్లేయర్ గా ఉండగా.. సానియ మీర్జా ఇండియా టెన్నిస్ స్టార్ గా గుర్తింపు పొందింది. అయితే భారత్- పాక్ మ్యాచ్ జరిగినప్పుడు మీరు ఎవరికి సపోర్టు చేస్తారంటూ కొందరు కామెంట్లు పెట్టడంతో ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె ఈసారి సోషల్ మీడియా నుంచిదూరంగా ఉంటున్నట్లు తెలిపింది.