జాన్వీ ని చిన్నచూపు చూడటానికి కారణం అదేనా..!

Update: 2021-06-24 08:30 GMT
'అతిలోక సుందరి' శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోని జాన్వీ.. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. మొదటి సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' చిత్రంతో మెప్పించింది. అయినప్పటికీ తన ఫ్రెండ్ సారా అలీఖాన్ మాదిరిగా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. జాన్వీ ని బాలీవుడ్ చిన్నచూపు చూడటానికి ప్రధాన కారణం ఆమె రెమ్యూనరేషన్ అని బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

జాన్వీ కపూర్ ప్ర‌స్తుతం ఏ సినిమాలో అయినా న‌టించాలంటే దాదాపు 4 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ట‌. దీని కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ వెనక్కి వెళుతున్నాయట. జాన్వీ కి పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉందనే నమ్మకంతో.. ఈమె మార్కెంటింగ్ టీమ్ కూడా ఆమె కెరీర్ ని స‌రైన ట్రాక్ ఎక్కించడం లేదని బాంబే సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి.. రేటు కాస్త తగ్గించుకుంటే మరిన్ని అవకాశాలు తలుపుతడతాయని.. స్టార్ట్ హీరోయిన్ జాబితాలో చేరిపోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే 'రూహి' సినిమాతో నిరాశపరిచిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం 'దోస్తానా 2' 'గుడ్ లక్ జెర్రీ' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించాడని ఈ బ్యూటీ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు - ఎన్టీఆర్ - రామ్ చరణ్ లలో ఎవరో ఒకరితో అమ్మడి టాలీవుడ్ డెబ్యూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో జాన్వీ ని తెలుగు తెరపై చూస్తామేమో!
Tags:    

Similar News