పాన్ ఇండియా స్టార్ ఆ గుట్టు విప్ప‌డం లేదు ఎందుక‌ని?

Update: 2022-09-16 02:30 GMT
`కేజీఎఫ్` సీరిస్ మూవీస్ తో క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ ఊహించ‌ని విధంగా పాన్ ఇండియా స్టార్ గా మారిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద య‌ష్ ని తిరుగులేని స్టార్ గా నిల‌బెట్టాయి. ఇండియాలో వున్న బిగ్గెస్ట్ స్టార్ ల జాబితాలో య‌ష్ ని కూడా ఓ స్టార్ గా నిల‌బెట్టాయి. చాప్ట‌ర్ 1 ఊహించ‌ని విధంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో చాప్ట‌ర్ 2 పై భారీ అంచనాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ద‌క్షిణాదితో పాటు ఈ మూవీ ఉత్త‌రాదిలోని హిందీ బెల్ట్ లో రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌లైన `కేజీఎఫ్ 2` రికార్డు స్థాయిలో రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని, సినీ విశ్లేష‌కుల‌ని విస్మ‌యానికి గురిచేసింది. ఏప్రిల్ 14న రికార్డు స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన నెల‌లు గ‌డుస్తున్నా రాఖీభాయ్ కొత్త ప్రాజెక్ట్ ని మాత్రం ప్ర‌క‌టించ‌డం లేదు. చాలా కూల్ గా విదేశాల‌న్నీ ఫ్యామిలీతో క‌లిసి చుట్టేస్తూ అక్క‌డ క‌లిసిన అభిమానుల‌తో ఫ్యాన్ డ‌మ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్ర‌త్యేక వెకేష‌న్ కోసం యూర‌ప్ వెళ్లిన రాఖీ భాయ్ ఫ్యామిలీలో చిల్ అవుతూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేశాయి. `కేజీఎఫ్ 2` విడుద‌లై నెల‌లు గ‌డుస్తున్నా రాఖీభాయ్ త‌న మేకోవర్ ని మార్చ‌డం లేదు. అదే బారు గ‌డ్డంతో తిరిగేస్తూ వున్నాడు. అంతే కాకుండా త‌ను చేయ‌బోయే నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని అందించ‌కుండా స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తుండ‌టం ఫ్యాన్స్ తో పాటు సినీ ల‌వ‌ర్స్ ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

రాఖీభాయ్ స‌స్పెన్స్ ని మెయింటైన్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం పేరున్న డైరెక్ట‌ర్ తో మ‌ళ్లీ ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ మెచ్చే క‌థ‌తో రావాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ వ‌స్తున్నాడ‌ని చెబుతున్నారు. రీసెంట్ గా య‌ష్ ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. వైట్ అండ్ వైట్ లో డాప‌ర్ లుక్ లో క‌నిపిస్తున్న త‌న ఫొటోకు `నేను వైట్ లో పోజ్ ఇచ్చాను. అలాగే నేను చీక‌టిని క‌లిగి వున్నాను` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News