సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’ చిత్రం తర్వాత సినిమాల స్పీడ్ చాలా తగ్గించాడు. చాలా అరుదుగా చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్నట్లు గా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ చిత్రం కాకుండా కొన్ని నెలల క్రితం ‘కాలా’ చిత్రం తో కూడా రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఒకవైపు 2.ఓ చిత్రం థియేటర్ లోనే ఉంది, మరో వైపు నెల రోజుల్లో ‘పేట’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. పేట సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే రజినీకాంత్ మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తున్నాడు.
రజినీకాంత్ ‘పేట’ చిత్రం విడుదలైన వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో తన 166వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ‘సర్కార్’ తో పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మురుగదాస్ ప్రస్తుతం రజినీకాంత్ కోసం అంతే పవర్ ఫుల్ పొలిటికల్ మూవీకి కథను సిద్దం చేస్తున్నాడు. స్టోరీ లైన్ ఇప్పటికే ఫైనల్ అయ్యింది, త్వరలోనే మొత్తం స్క్రిప్ట్ కూడా పూర్తి కాబోతుంది. మురుగదాస్ తో సర్కార్ చిత్రాన్ని నిర్మించిన సన్ నెట్ వర్క్ సంస్థ రజినీకాంత్ తో కూడా సినిమాను నిర్మించబోతుంది.
రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ మద్య రజినీ కాంత్ కూడా తన రాజకీయ ప్రవేశం ఉంటుందని ప్రకటించాడు. అది ఎప్పుడు, ఎలా అనే విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు కాని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి రజినీకాంత్ రాజకీయాల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కూడా ఉన్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పే ముందు చకచక ఓ నాలుగు సినిమాలు చేసేయాలనేది రజినీ జీ ఆలోచనగా తెలుస్తోంది.