‘మా’ ఎన్నికల హడావుడి.. దాని కారణంగా చోటు చేసుకున్న సంచలన ప్రకంపనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆ మాటకు వస్తే.. క్యాలెండర్లో రోజులు గడిచే కొద్దీ.. వీటి తీవ్రత ఎక్కువ అవుతున్నాయే తప్పించి తగ్గని పరిస్థితి. తాజాగా వెల్లడైన ‘మా’ ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలవటం తెలిసిందే. సాధారణంగా పదవి ఎంత చిన్నదైనా.. పెద్దదైనా ప్రమాణస్వీకార మహోత్సవాన్ని భారీగా నిర్వహిస్తున్న రోజులు ఇవి. అలాంటిది.. మహా సంగ్రామంగా మార్చిన ‘మా’ ఎన్నికల్లో విజయం సామాన్యమైనది కాదు.
అలాంటిది ఎలాంటి హడావుడి.. ఆర్భాటం లేకుండా.. మిగిలిన వారి సంగతి తర్వాత తన జట్టు వారికి సైతం పూర్తిస్థాయిలో సమాచారం లేకపోవటమే కాదు.. డీఆర్ సీ పెద్దలకు.. చివరకు ఎన్నికల అధికారికి సైతం తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్న విషయం తెలీకుండా హడావుడిగా చేసేయటం విష్ణుకు మాత్రమే చెల్లుతుందన్న మాట వినిపిస్తోంది.
మంగళవారం ఉదయం అంత హడావుడిగా విష్ణు ఎందుకు ప్రమాణస్వీకార మహోత్సవాన్ని సింఫుల్ గా పూర్తి కానిచ్చేశారు? అన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వర్గాల అభిప్రాయం ప్రకారం.. ‘మా’ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు విడుదలయ్యాక చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఆలస్యం అమృతం విషంలా మారుతుందన్న ఆలోచనే హడావుడి ప్రమాణస్వీకారానికి కారణంగా చెబుతున్నారు. అనూహ్యంగా ప్రకాశ్ రాజ్ టీంకు సంబంధించిన వారు ఎవరైనా కోర్టను ఆశ్రయిస్తే.. మొదటికే మోసం రావటమే కాదు.. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్ని బూడిదలో పోసిన పన్నీరు అవుతాయన్న ఆలోచనే హడావుడి ప్రమాణ స్వీకారానికి కారణంగా చెబుతున్నారు.
ఎన్నికల్లో నిర్బీతిగా ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి చేసిన ప్రచారాలకు.. పోలింగ్ వేళ.. పోలింగ్ స్టేషన్ల లోపల జరిగిన సీన్ల వేళ.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరించిన విష్ణు.. విజయం సాధించిన తర్వాత అంతకు మించిన ధీమాను ప్రదర్శించే కన్నా.. చేతి వరకు వచ్చిన అధికారాన్ని సొంతం చేసుకోవటానికి పడిన తపన ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఏమీ చేయలేరన్న ప్రకాశ్ రాజ్ టీంకు ఒకింత భయానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటన్నది రానున్న రోజులు స్పష్టం చేస్తాయని చెప్పాలి.