పోలీస్ స్టేష‌న్ లో ఆ న‌టుడిపై భార్య ఫిర్యాదు

Update: 2017-07-02 06:07 GMT
కోలీవుడ్ లో సుప‌రిచిత న‌టుడు.. అక్క‌డి బుల్లితెర‌లో ప్ర‌ముఖంగా వెలిగిపోయే దాడి బాలాజీపై ఆయ‌న స‌తీమ‌ణి నిత్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.  త‌న భ‌ర్త నిత్యం తాగొచ్చి.. త‌న‌ను కొడుతుంటాడ‌ని వాపోయింది. త‌న‌కు న్యాయం చేయాల‌ని.. త‌న భ‌ర్త‌పై త‌గిన చ‌ర్య తీసుకోవాల‌ని కోరింది.

సుప‌రిచితుడైన ఒక న‌టుడి మీద ఆయ‌న భార్యే స్వ‌యంగా చెన్నై పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లి ఫిర్యాదు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. భ‌ర్త‌పై ఫిర్యాదు చేశాక‌..  మీడియాతో మాట్లాడారు. త‌న భ‌ర్త రోజూ తాగొచ్చిన త‌న‌ను కొడుతున్నాడ‌ని పేర్కొంది. గ‌త నెల‌లో అత‌ను కొట్టిన గాయం పెద్ద గాయ‌మై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ట్లుగా పేర్కొన్నారు.

త‌న‌కు.. త‌న భ‌ర్త‌కు మ‌ధ్య ప‌దిహేనేళ్ల వ్య‌త్యాసం ఉంద‌ని.. పెళ్లికి ముందు అత‌నికి అంత‌కు ముందే పెళ్లి అయిన విష‌యం తెలీద‌న్నారు. త‌న మొద‌టి భార్య మాదిరే నేను కూడా వ‌దిలేసి వెళ్లిపోతాన‌న్న భ‌యం ఉంద‌ని.. గ‌తంలో తాను రెండు మూడు కంపెనీల్లో ప‌ని చేసిన‌ట్లుగా చెప్పారు.

తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీల‌కు వ‌చ్చి గొడ‌వ చేశాడ‌ని ఆరోపించారు. తాగొచ్చి  త‌న‌ను అనుమానిస్తూ మాట్లాడ‌టం.. చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌టం చేస్తుంటాడ‌ని.. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News