రవితేజ రేంజ్ లో.. బాలయ్య బ్రతికిస్తాడా?

Update: 2023-01-12 13:30 GMT
ఫెస్టివల్ సీజన్ అనేది సినిమా ఇండస్ట్రీలకు చాలా ముఖ్యమైనది.  ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ లో ఒకేసారి భారీ స్థాయిలో పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక క్రిస్మస్ సెలవులలో కూడా పలు సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇక మాస్ మహారాజ్ కూడా క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేస్తూ న్యూ ఇయర్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నాడు.

ఇక వారం హాలిడేస్ లోనే సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ధమాకా సినిమాకు అసలు మొదట చాలా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని చాలామంది కామెంట్స్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా మాస్ మహారాజ రవితేజ మంచి ఎంటర్టైన్మెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించే ప్రయత్నం చేశాడు.

ఇక మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పెంచుకుంది. ఏకంగా 100 కోట్లు వచ్చాయి అని చిత్ర నిర్మాతలు ప్రచారాలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రవితేజ నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలను సేఫ్ అయ్యేలా చేశాడు.

ఇక నందమూరి బాలకృష్ణకు కూడా అదే తరహాలో ఒక పెద్ద టాస్క్ అయితే ఎదురైనట్లుగా అనిపిస్తుంది. బుధవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా అసలు ఊహించిన విధంగా మిక్స్ డ్ టాక్ అందుకుంటుంది. అసలు ఇలాంటి టాక్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు.  టాక్ ఎలా ఉన్నా కూడా ఆడియన్స్ మాత్రం ఈ సంక్రాంతి ఫెస్టివల్ సినిమాలు చూసేందుకు ఎక్కువ స్థాయిలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

మరి అంత బ్యాడ్ టాక్ ఏమీ రాలేదు కాబట్టి బాలయ్య సినిమాకు ఆడియన్స్ సంఖ్య అయితే ఇప్పట్లో తగ్గేలా లేదు అని చెప్పవచ్చు. కానీ యాక్షన్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ పూర్తి స్థాయిలో టర్న్ అవుతారా లేదా అనేది టైమ్ చెబుతుంది. మరోవైపు వాల్తేరు వీరయ్య కూడా పోటీగా ఉంది. ఆ సినిమాను కూడా దాటుకుంటూ బాలయ్య వెళ్లాల్సి ఉంటుంది.

ఆ సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం విరసింహారెడ్డి పై కొత్త ప్రభావం పడుతుంది. ఇక ధమాకా అనే ఎంటర్టైన్మెంట్ సినిమాతో రవితేజ క్రిస్మస్ లో ఎలాంటి పోటీ లేకుండా కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి అనే యాక్షన్ సినిమాతో బాలయ్య బాబు బాక్సాఫీస్  కలెక్షన్స్ తో బ్రతికిస్తాడా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News