తెలుగు సినిమాలు హిందీలో విడుదలై బంపర్ హిట్లు కొడుతున్న సందర్భమిది. ఆర్.ఆర్.ఆర్- పుష్ప-'కార్తికేయ- 2' లాంటి చిత్రాలు ఇటీవల ఉత్తరాదిన విడుదలై సంచలన విజయం సాధించాయి. దీనర్థం హీరో ఎవరు ? ఏ భాషా చిత్రం? అనేది ప్రేక్షకులకు అనవసరం. స్టార్లంతా ప్రవచిస్తున్న 'కంటెంట్ ఈజ్ కింగ్' అనేది నేడు శాసిస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఏకైక మంత్రమిది. ఇక కంటెంట్ తో పాటు స్టార్ డమ్ యాడైతే అది అదనపు బలంగా మారుతుంది.
ఇటీవలి కాలంలో తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు చిత్రసీమలో మార్కెట్ ని అనూహ్యంగా పుంజుకున్న తీరును పరిశీలిస్తే అతడు ఏడెనిమిదేళ్లుగా సక్సెస్ అనేది లేకపోయినా తన పోరాటాన్ని అవిశ్రామంగా కొనసాగించాడు. పలుమార్లు దండయాత్ర తర్వాత ఇప్పటికి విజయ్ కి ఇరుగు పొరుగునా గుర్తింపు దక్కింది. దీనికితోడు కంటెంట్ విజయ్ సినిమాలను ఇక్కడ డ్రైవ్ చేస్తోంది.
ఇప్పుడు ఇదే తీరుగా తెలుగు హీరోలు కూడా హిందీ మార్కెట్ ని కొల్లగొట్టాలన్న ప్రయత్నంలో ఉండడం ప్రశంసనీయం. బాహుబలి - ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలను వదిలేస్తే పుష్ప- కార్తికేయ 2 విజయాలు హిందీ బెల్ట్ లోను కేవలం కంటెంట్ వల్లనే సాధ్యమైంది. దీనిని పుష్ప ఫ్రాంఛైజీ .. కార్తికేయ ఫ్రాంఛైజీ మరింత ముందుకు తీసుకెళతాయనడంలో సందేహం లేదు. ఆ దిశగా ఇప్పటికే మేకర్స్ తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇకమీదట ఇతర తెలుగు హీరోలు కూడా ఇదే ఫార్ములాను అనుసరించాలని ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ఇప్పటికే సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియన్ సినిమాతో హిందీ బెల్ట్ లో ప్రశంసలు అందుకున్నారు. బాలీవుడ్ మీడియా సైరా చిత్రాన్ని క్లాసిక్ గా అభివర్ణించింది. కానీ మెజారిటీ ప్రజలకు ఈ సినిమా చేరువ కాకపోవడంతో ఆశించిన వసూళ్లు దక్కలేదు. దానికి కారణాలు అనేకం. ఇక ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ అప్పటికే ఓటీటీలో దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించిన ఒక మలయాళ చిత్రానికి రీమేక్ కావడంతో హిందీ బెల్ట్ లో సరిగా ఆడలేదు. అది చిరును నిరాశపరిచే అంశం కానేకాదు.
అందుకే ఈసారి స్ట్రెయిట్ కంటెంట్ తో హిందీ బెల్ట్ లో ఏదైనా మ్యాజిక్ సాధ్యమవుతుందేమో ప్రయత్నిస్తున్నారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య లాంటి మాస్ చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ సహా శాటిలైట్ పరంగాను బోలెడంత బజ్ ఉంది. అయితే థియేట్రికల్ రిలీజ్ అనేది కొంత సాహసంతో కూడుకున్నది. ఈరోజుల్లో ఏ సినిమా ఆడుతుంది? ఏది ఆడదు? అనడానికి ప్రమాణాలు లేవు. స్టార్ డమ్ ని మించి కంటెంట్ వర్కవుటవుతోంది. వాల్తేరు వీరయ్య చిత్రం పూర్తిగా యూనిక్ కంటెంట్ తో రూపొందిన సినిమా అని ఇన్ సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. బహుశా ఇది కేవలం మాస్ యాక్షన్ సినిమా అని భావిస్తే అది పెద్ద పొరపాటు. ఈ సినిమా కథ కంటెంట్ లో యూనిక్ నెస్ పాన్ ఇండియా లెవల్లో వర్కవుటవుతుందనేది బాస్ చిరంజీవి విశ్లేషించారని తెలిసింది.
ఇప్పుడు పాన్ ఇండియా కేటగిరీలో ఇలాంటి సినిమాలు వర్కవుటైనా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన తన చిత్రబృందంతో అన్నారని కూడా ఒక సోర్స్ చెబుతోంది. ఉత్తరాదిన మాస్ కి సినిమాని కనెక్ట్ చేయగలిగితే దాని మైలేజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇప్పటికే హిందీ బెల్ట్ లో చిరంజీవి బాగా సుపరిచితమైన ముఖం కాబట్టి అతడి సినిమాకి కొంత బజ్ ఉంది. అందుకే ఇప్పుడు ఉత్తరాదినా వాల్తేర్ వీరయ్యను క్యాలిక్యులేటెడ్ ఏరియాల్లో పెద్దగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది నిజానికి అర్బన్ ప్రాంతాలు మెట్రోల కంటే ఇతర మాస్ ఏరియాల్లో బాగా ఆడుతుందని భావిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
సైరా నరసింహారెడ్డి- గాడ్ ఫాదర్ (అప్పటికే మలయాళంలో చూసేసిన సినిమా) లకు భిన్నమైన కంటెంట్ తో వాల్తేర్ వీరయ్య తెరకెక్కుతోంది. ఈ చిత్రం మాస్ కి స్పెషల్ ట్రీట్ ని అందించబోతోంది. అయితే ముంబై మీడియాలో ప్రచారం కూడా కీలకం కానుంది. దానికోసం చిరంజీవి - బాబి బృందం ప్రత్యేక ప్రణాళికలను కలిగి ఉందని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది.. సంక్రాంతి బరిలో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమాకి పొరుగు భాషల్లో సరైన ప్రచారం లేని సంగతి వాస్తవం. కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున హిందీలో పెద్దగా అంచనాలు పెంచకుండా పరిమిత ప్రమోషన్లతోనే రిలీజ్ చేయాలని కంటెంట్ మాట్లాడే విధంగా చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని తెలిసింది.
హైప్ లేకుండానే పుష్ప 2 .. కార్తికేయ 2 రిలీజై విజయం సాధించాయి. 'వాల్తేరు వీరయ్య'కు అనవసర కలరింగ్ ఇవ్వకుండా రిలీజ్ చేయాలనే ప్రయత్నం సాగుతోంది. అయితే ఫలితం ఎలా ఉన్నా.. దాని గురించి అంతగా హర్రీ అయ్యేది లేదు. బహుశా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భవిష్యత్ చిత్రాలు పూర్తిగా యూనిక్ పాన్ ఇండియా కంటెంట్ తో రూపొందే ఛాన్సుంది. ఇవి భారీ మల్టీస్టారర్లుగాను తెరకెక్కించే ప్రణాళికలను కలిగి ఉన్నారని తెలిసింది. ఇప్పుడు హిందీ పరిశ్రమలో మెగా కాంపౌండ్ నుంచి రిలీజయ్యేవి కేవలం టీజర్ లు మాత్రమేనని మెగా కాంపౌండ్ కి అత్యంత సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. టీజర్ తర్వాత ట్రైలర్.. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది!! ఫాలోఅప్ స్టోరీల కోసం 'తుపాకి'ని అనుసరించండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.