మునుపెన్నడూ లేని విధంగా తమిళ హీరోలు టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టిన విషయం తెలిసిందే. మన హీరోలంతా పాన్ ఇండియా సినిమాల వైపు పరుగులు తీస్తుంటే తమిళ హీరోలు మాత్రం టాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ పాగా వేయాలని ఇక్కడి డైరెక్టర్లతో సినిమా చేయడం మొదలు పెట్టారు. ఇందు కోసం ముగ్గురు తమిళ స్టార్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ మూవీని చేస్తున్నాడు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ తమిళంలో 'వారీసు'గా, తెలుగులో 'వారసుడు'గా రూపొందుతోంది. సినిమా ప్రారంభం నుంచి ఇది బైలింగ్వల్ మూవీ అంటూ ప్రొజెక్ట్ అవుతూ వస్తోంది. దీంతో కోలీవుడ్ స్టార్ విజయ్ ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వరుస కథనాలు వినిపించాయి. అయితే ఇటీవల టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ జరిగిన నేపథ్యంలో ఈ మూవీ అసలు బైలింగ్వల్ కాదనే విషయం బయటికొచ్చింది.
ఇది కంప్లీట్ తమిళ సినిమా. తెలుగులో 'వారసుడు'గా డబ్బింగ్ చేయబోతున్నామంటూ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఇక విజయ్ తరువాత మరో స్టార్ హీరో శివ కార్తికేయన్ 'ప్రిన్స్' పేరుతో 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వంలో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు ఓ బైలింగ్వల్ మూవీకి శ్రీకారం చుట్టారు. ముందు నుంచి ఈ సినిమాకు కూడా ఇదే ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా విడుదలైన ఈ మూవీని గమనిస్తే ఇది తమిళ సినిమా అని, తెలుగులో డబ్బింగ్ చేశారని తెలిసింది.
తెలుగు దర్శకుడు, తెలుగు మేకర్స్ కలిసి చేసిన రెండు సినిమాలు బైలింగ్వల్ మూవీస్ కాదని తేలడం.. రీసెంట్ గా విడుదలైన 'ప్రిన్స్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడంతో ఇప్పడు అందరి దృష్టి ధనుష్ హీరోగా నటిస్తున్న 'సార్' మూవీపై పడింది. ఈ మూవీని తెలుగు మేకర్స్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అధినేత సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ బైలింగ్వల్ మూవీనా లేక విజయ్ వారీసు, శివ కార్తికేయన్ 'ప్రిన్స్' తరహాలో తమిళ సినిమానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళంలో 'వాతీ'గా తెలుగులో 'సార్'గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలైంది. మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఇది బైలింగ్వల్ మూవీనా లేక తమిళ సినిమానా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. బైలింగ్వల్ అయితే తొలి సారి ధనుష్ తెలుగులో సాహసం చేయబోతున్నాడన్నమాట.
అదే బైలింగ్వల్ కాదంటే తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ మూవీ కూడా ఆకట్టుకోవడం కష్టమనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ధనుష్ 'గ్రహణం' ఫేమ్ మిలింద్ రావు డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం 'సార్'తో పాటు 'కెప్టెన్ మిల్లర్'మూవీలో నటిస్తున్న ధనుష్ ఈ మూవీ తరువాత మిలింద్ రావు ప్రాజెక్ట్ లో నటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.