తమిళం వైపు అడుగేస్తున్న గద్దలకొండ హీరోయిన్..

Update: 2020-07-06 10:30 GMT
సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు తక్కువ కాలంలోనే స్టార్స్ అయిపోతారు. కొందరు చిన్న క్యారెక్టర్ రోల్ చేసి కూడా పెద్ద సినిమాలలో అవకాశాలు పొందుతారు. కానీ కొందరు యంగ్ హీరోయిన్స్ మాత్రం అందం ఉండి.. టాలెంట్ ఉండి కూడా సెటిల్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది. అలాంటి టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో డింపుల్ హయాతి ఒకరు. ఈ బ్యూటీ 2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాకి పేరొచ్చినా అందులో నటులకు మాత్రం పేరు రాలేదు. అలా అమ్మడికి మొదటి సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. సామాన్యంగా అందరు హీరోయిన్లకు ఫస్ట్ సినిమా ప్లస్ అవుతుంది.

కానీ హయాతికి పెద్దగా ఉపయోగ పడలేదని చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత యురేకా సినిమాలో ఓ క్యారెక్టర్ ప్లే చేసింది. ఆ సినిమా కూడా ఆశించిన పేరు తీసుకురాలేదు. ఇక ఈ అమ్మడు గతేడాది హరీష్ శంకర్ రూపొందించిన గద్దలకొండ గణేష్ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. సూపర్ హిట్టు నీ హైట్.. సూపర్ హిట్టు నీ రూట్.. అంటూ అమ్మడి అందాలను కూడా ఆరబోసి ఆకట్టుకుంది. అలాగని మంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఈ భామ దగ్గరికి రాట్లేదట. తెలుగులో కేవలం ఐటమ్ సాంగ్స్ కోసం మాత్రమే హయాతిని దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారని ఆవేదన చెందుతోంది.

ఇక లాభం లేదని కోలీవుడ్ వైపు అడుగులేస్తుంది. తమిళం నుండైతే మంచి ఆఫర్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ భామ తాజాగా మాట్లాడుతూ.. యూత్ కోసం అందాలు ఆరబోయక తప్పదు అంటుంది. చిన్నప్పటి నుండి మంచి నటిగా పేరు పొందాలని ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడేమో గ్లామర్ రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలా అని గ్లామర్ రోల్స్ చేయనని కాదు. మళ్లీ గ్లామర్ డాల్ అని అనిపించుకోవాలని లేదు. ఇక నేను బాషాబేధం లేకుండా సినిమాలు చేస్తానని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల మూవీలో నటిస్తూ.. తమిళ కథలు వింటోందని సమాచారం.
Tags:    

Similar News