స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే? బెనిఫిట్ షోలు.. వారం పది రోజుల పాటు ఐదు షోలు తప్పనిసరిగా పడుతుంటాయి. 'ఆర్ ఆర్ ఆర్' ..'ఆచార్య'..'కేజీఎఫ్-2'.. 'ఎఫ్-3' లాంటి చిత్రాలు ఏడాది ఆరంభంలో ఐదు షోలు పడ్డ చిత్రాలుగా నిలిచాయి. అయితే ఐదవ షో అనేది తదుపరి కొనసాగించాలా? లేదా? అన్నది ఫస్ట్ షో అనంతరం తేలిపోయింది.
సినిమాకి హిట్ టాక్ వచ్చి ఆన్ లైన్ బుకింగ్స్ బాగుంటే అదనపు షో పడుతుంది. లేదంటే పాత సన్నివేశమే కనిపిస్తుంది. కంటెంట్ విషయంలో ఢోకా లేకపోతే జనాలు థియేటర్ కి వస్తారని ఇప్పటికే 'బింబిసార'..'సీతారామం'..'కార్తికేయ-2' చిత్రాలు నిరూపించాయి. లేదంటే ఎంత పెద్ద స్టార్ సినిమా కి అయినా ఆక్యుపెన్సీ లేక ఇబ్బంది పడాల్సిందేనని ఇటీవల రెండు ప్లాప్ సినిమాలు రుజువు చేసాయి.
ఆ రకంగా థియేటర్ లో ఐదవ షో పడి మూడు నాలుగు నెలలు కావొచ్చు. ఈ మధ్యలో రిలీజ్ అయినవన్నీ మీడియం రేంజ్ సినిమాలు కావడంతో ఐదవ షో పడలేదు. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు థియేటర్ల సంఖ్యని పెంచుకుని వసూళ్లు సాధించాయి తప్ప! ఎక్కడా ముందుగానే ఆత్రాన్ని ప్రదర్శించలేదు. వాస్తవానికి ఆ చిత్రాలు మూడు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సక్సెస్ అయినవి.
మరి ఇప్పుడు ఐదవ షో పడటానికి రెడీగా ఉన్న సినిమా ఏదైనా ఉంది? అంటే పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతున్న 'లైగర్' ఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ర్టాల్లో ఇద్దరికీ మంచి క్రేజ్ ఉంది.
సాధారణంగా పూరి బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోతుంది. ఇప్పుడా బ్రాండ్ కి మరో బ్రాండ్ తోడైంది కాబట్టి ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించడం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'లైగర్' బెనిపిట్ షోలకు..అదనపు షోలకు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాల అనుమతి కోరుతున్నట్లు తెలుస్తోంది.
మరి టిక్కెట్ ధర పెంచి విక్రయిస్తారా? పాత ధరలతోనే జనాల్ని థియేటర్ కి ర ప్పిస్తారా? అన్నది తేలాలి. ఇప్పటికే థియేటర్ కి ప్రేక్షకులు రావడం లేదని తెలుస్తోంది. కంటెంట్ లోపముంటే? థియేటర్ వైపు చూసే పరిస్థితి లేదు. ఇవన్ని లైగర్ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.