విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప'' ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. తమిళ 'అసురన్' చిత్రానికి ఆఫీసియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. నారప్ప పాత్రలో వెంకటేష్ - ఆయన భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి.. పెద్ద కొడుకుగా కార్తీక్ రత్నం.. ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వెంకీ కి జోడీగా నటించిన అమ్ము అభిరామి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.
'అసురన్' చిత్రంలో ధనుష్ సరసన మరియమ్మ పాత్రలో నటించిన అమ్ము అభిరామి.. ఇప్పుడు తెలుగు 'నారప్ప' సినిమాలో కన్నమ్మ గా కనిపించింది. 20 ఏళ్ల అభిరామి.. సీనియర్ హీరో వెంకటేష్ కి జోడీగా కుదరలేదనే కామెంట్స్ వచ్చినా.. తన పాత్ర వరకు బాగా చేసిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్ము కు 'నారప్ప' మొదటి సినిమా కాదు. ఆల్రెడీ డబ్బింగ్ సినిమాలతో పరిచయం అవడమే కాకుండా.. తెలుగులో డెబ్యూ మూవీ కూడా చేసింది.
తమిళ అమ్మాయి అయిన అమ్ము అభిరామి.. విజయ్ హీరోగా రూపొందిన 'ఏజెంట్ భైరవ' అనే డబ్బింగ్ సినిమాలో చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 'ఖాకీ' 'గ్యాంగ్' చిత్రాల్లో నటించిన అభిరామి.. తమిళ 'రాచ్చసన్' సినిమాతో మెప్పించింది. తెలుగు 'రాక్షసుడు' సినిమాలో హీరో మేనకోడలి పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో వచ్చిన 'అసురన్' సినిమాతో బాగా ఫేమస్ అయింది.
ఈ ఏడాది ప్రారంభంలో 'FCUK' (ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్) సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అమ్ము గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇప్పుడు 'నారప్ప' చిత్రంతో మరోసారి పలకరించింది. తన అభినయంతో తమిళ ప్రేక్షకులను మెప్పించిన అమ్ము అభిరామికి.. నారప్ప తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాడేమో చూడాలి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న 'నవరస' వెబ్ సిరీస్ లో సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.