స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో మూడోది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కరోనా కారణంగా నిలిచిపోయింది. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండటంతో అలాగే హీరో అల్లు అర్జున్ కరోనా బారినపడటంతో షూటింగ్ ఆగిపోయింది. అలాగే ఇండస్ట్రీ అంతా షూటింగ్స్ నిలిపేసి పోస్ట్ ప్రొడక్షన్ - ఎడిటింగ్ లాంటి పనులు చూసుకుంటున్నారు. అయితే హీరో అల్లు అర్జున్ కరోనా బారినపడి ఆల్రెడీ కోలుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకుని త్వరలోనే షూట్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికే పుష్ప సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం విదితమే. ఆల్రెడీ మొదటి పార్ట్ కు సంబంధించి 90% షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ షూట్ కూడా 10% పూర్తి అయిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఓ రఫ్ అండ్ రస్టెడ్ విలేజ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు.
ఇదిలా ఉండగా.. ఈసారి డైరెక్టర్ సుకుమార్ బృందం సింగల్ షెడ్యూల్లో ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలనీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. అందుకోసం ఓ భారీ షెడ్యూల్ సెట్ చేసుకొని హైదరాబాద్ లోనే షూట్ మొత్తం పూర్తి చేసుకునే విధంగా సుకుమార్ ప్లాన్ అని టాక్. మరి అసలే లెక్కలమాస్టర్ లెక్కలు తప్పకుండా సినిమాలు ఫినిష్ చేస్తారు. ఈసారి మాత్రం సింగల్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ కాగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ నుండి వస్తున్న రియలిస్టిక్ మూవీ ఇది. అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది.