పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మరియు అన్ని పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.. సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే రాబోయే రోజుల్లో ముమ్మరంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇకపోతే గతేడాది 'జాతి రత్నాలు' సినిమా విడుదలైన రోజునే 'రాధేశ్యామ్' చిత్రం రిలీజ్ అవుతుండటం గమనార్హం. మహా శివరాత్రి కానుకగా 2021 మార్చి 11న థియేటర్లలోకి వచ్చిన 'జాతి రత్నాలు' నవ్వులు పూయించి భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపుగా 30 కోట్ల వరకు షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పాండమిక్ టైములో ఓవర్ సీస్ లో తెలుగు సినిమాలకు ఊపిరి పోసింది. ఇప్పుడు అదే తేదీకి ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కూడా అలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్నే అందుకుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాకపోతే గతేడాది పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరనేది గమనించాల్సి ఉంది. కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఆన్ లైన్ క్లాసులకు స్వస్తి చెప్పి కాలేజీలు స్కూళ్ళు రీఓపెన్ చేస్తున్నారు. అందులోనూ మార్చి మొదటి మూడు వారాలు పరీక్షలతో చాలా వరుకు యూత్ మొత్తం బిజీగా ఉంటారు. మెజారిటీ యువత సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. కాబట్టి సినిమా ఎంత బాగున్నా సరే మొదటి మూడు రోజులు తరువాత నుంచి కలెక్షన్లు డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీనికి తోడు మార్చి 4న డీసీ కామిక్ సూపర్ హీరో మూవీ ‘బ్యాట్ మ్యాన్’ రిలీజ్ అవుతోంది. సూపర్ హీరో చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇండియాలో ఎఫెక్ట్ చూపకపోయినా.. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసి ప్రభాస్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, 'రాధే శ్యామ్' చిత్రంలో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్ కనిపించనున్నారు. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతి బాబు - మురళీ శర్మ - సచిన్ ఖేడ్‌కర్ - జయరామ్ - ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేసారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ - యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. హిందీలో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.