మంత్రిగారి ఆఫ‌ర్ ని రానా స్వీక‌రిస్తారా?

Update: 2022-06-15 08:32 GMT
టాలీవుడ్ లో ఎన్నో ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు వున్నాయి. అయితే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కున్న ప్ర‌త్యేక‌త‌, సీనియారిటీ వేరు. తెలుగులో వున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ ఇది. డా. రామానాయుడు .. స్వ‌ర్గీయ తారాక రామారావు నుంచి నేటి హీరోల వ‌ర‌కు ఎంతో మందితో హిట్ లు, సూప‌ర్ హిట్ లు, బ్లాక్ బ‌స్ట‌ర్ లు.. మ‌ర‌పు రాని సినిమాల‌ని ఎన్నింటినో నిర్మించారు. దేశంలో వున్న అనేక భాష‌ల్లో సినిమాలు నిర్మించిన నిర్మాత‌గా అరుదైన ఘ‌న‌త‌ని సాధించ‌డ‌మే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో నిలిచారు. ఆయ‌న లెగ‌సీని కంటిన్యూ చేస్తూ ఈ సంస్థ బాధ్య‌త‌ల్ని డి. సురేష్ బాబు నిర్వ‌హిస్తున్నారు.  

ఈ సంస్థకు హైద‌రాబాద్ తో పాటు వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ పేరు తో సినీ స్టూడ‌యోస్ వునం్నాయి. అయితే తెలంగాణ లోని ఏ ఇత‌ర జిల్లాల్లో దీరికి ప్ర‌త్యేకంగా స్టూడియోలు లేవు. ఇదే విష‌యాన్ని తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇటీవ‌ల ప్ర‌స్తావించి హీరో రానాకు ఓపెన్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివారాల్లోకి వెళితే... రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'విరాట‌ప‌ర్వం'.

వేణు ఊడుగుల డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ మూవీ జూన్ 17న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని ఇటీవ‌ల చిత్ర బృందం వ‌రంగ‌ల్ లో భారీ స్థాయిలో నిర్వ‌హించింది. ఈ వేడుక కు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు హీరో రానా, సాయి ప‌ల్ల‌వి, ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌, నిర్మాత‌లు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హీరో రానాకు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు.
 
త‌న తాత డి. రామానాయుడు, తండ్రి సురేష్ బాబు హైద‌రాబాద్, వైజాగ్ ల‌లో స్టూడియోలు ఏర్పాటు చేసిన‌ట్టుగానే రానా కూడా వ‌రంగ‌ల్ లో రామానాయుడు స్టూడియోని నిర్మించాల‌ని చెప్పారు. ఇందుకు రానా అంగీక‌రిస్తే స్టూడియో నిర్మాణానికి స్థ‌లాన్ని కూడా సేక‌రించి పెడ‌తాన‌ని, వ‌రంగ‌ల్ లో స్టూడియో ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఇక్క‌డ సినిమా షూటింగ్ లు కూడా పెరిగే అవ‌కాశం వుంద‌ని, ఖచ్చితంగా ఇక్క‌డ షూటింగ్ లు ఊపందుకుంటాయ‌ని చెప్పుకొచ్చారు. అయితే రానా మంత్రి ఇచ్చిన ఆఫ‌ర్ ని అంగీకరిస్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

గ‌త కొంత కాలంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ యాక్టీవ్ గా సినిమాలు చేయ‌డం లేదు. వేరే ప్రొడ్యూస‌ర్స్ నిర్మించిన చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడి సురేష్ బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారే కానీ స్వ‌యంగా సినిమాలు నిర్మించ‌డం లేదు. అదీ కూడా మీడియం బ‌డ్జెట్ మూవీస్ కి, రానా, వెంక‌టేష్ మూవీస్ కి మాత్ర‌మే స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పెద్ద సినిమాల వైపు కు వెళ్ల‌డం లేదు. పంపిణీ రంగంలోనూ చాలా వ‌ర‌కు యాక్టీవ్ గా వుండ‌టం లేదు. అంతే కాకుండా ఏపీ ప్ర‌భుత్వంలో సంస్థ‌కు కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఈ నేప‌థ్యంలో మంత్రి ఆఫ‌ర్ ని రానా అంగీక‌రిస్తారంటే క‌ష్ట‌మే. ఆఫ‌ర్ ని అంగీక‌రించ‌క‌పోతే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కు ప్ర‌భుత్వం నుంచి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం వుంటుందా? అన్న‌ది మ‌రో వాద‌న‌గా వినిపిస్తోంది. దీంతో రానా ఎటూ తేల్చుకోలేని ఇర‌కాటంలో ప‌డ్డార‌ని అంతా అంటున్నారు.
Tags:    

Similar News