టాలీవుడ్ మ్యాచో మ్యాన్ రానా దగ్గుబాటి నటించిన చిత్రం 'విరాటపర్వం'. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గత కొన్ని నెలలుగా థియేటర్లలోకి వస్తుందా?. అసలు ఈ సినిమా గురించి ఎందుకు మేకర్స్ మాట్లాడటం లేదని రక రకాల చర్చలు నడిచాయి. ఫ్యాన్స్ మాత్రం ఇక ఈ సినిమాపై హోప్స్ వదిలేసుకోవాల్సిందేనా? అని సోషల్ మీడియా వేదికగా రానాకు ట్వీట్ లు చేశారు. అయినా రానా నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఈ మూవీని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు షికారు చేశాయి.
ఈ వార్తలని కూడా టీమ్ పెద్దగా కండించలేదు. ఫైనల్ గా ఈ మూవీని జూలై 1న విడుదల చేస్తున్నామంటూ కొత్త పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో సైలెంట్ గా వున్న చిత్ర బృందం ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చేస్తున్నామంటూ అప్ డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా హ్యాపీ ఫీలయ్యారు. అయితే కొంత మంది నిరుత్సాహాన్ని కూడా ప్రదర్శించారు.
కారణం జూలై 1 అంటే దాదాపుగా 55 రోజులుంది. ఇన్ని రోజులు గ్యాప్ చాలా ఎక్కువని, త్వరగా రిలీజ్ చేయండని రానాని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే రానా మాత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ని అభిమానులతో పంచుకుంటూ ప్రామిస్ చేశాడు. 55 రోజులంటే చాలా రోజులు ఎదురుచూడాల్సిందే. అయితే ఆ ఎదురుచూపులకు మించి ఈ సినిమాతో మీకు ఓ క్లాసిక్ ని అందించబోతున్నానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నానన్నారు. అంటే సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే రానా క్లాసిక్ ఇస్తానని ప్రామిస్ చేస్తాడని ఇప్పడు అభిమానులు ఆరా తీస్తున్నారు.
1990లో ఉత్తర తెలంగాణలో నక్సల్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. చాలా వరకు రాష్ట్రా రాజకీయాల్లో నక్సల్స్ ఉద్యమం తీవ్ర కలకలం సృష్టించింది. ఆనాటి పల్లెల్లో జరిగిన పలు యదార్థ సంఘటనలు.. అదిలాబాద్‌లో జరిగిన ఓ కీలక సంఘటనని తీసుకుని, దానికి అందమైన ప్రేమకథని జోడించి దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
'తెలుగు నేలపై నడిచిన కొత్తదారుల నెత్తుటి జ్ఞాపకం మలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం' అంటూ అందమైన ఓ దృశ్య కావ్యంలా ఈ సినిమాని దర్శకుడు వేణు ఊడుగుల వర్ణించిన తీరే ఈ మూవీ ఏ స్థాయిలో తెరకెక్కించాడో ఇందుకు అద్ధం పడుతోంది.
అయితే ఏడాది కాలంగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, సినీ ప్రియులకు 'విరాటపర్వం' రూపంలో ఓ క్లాసిక్ ని అందిస్తానని ప్రామిస్ చేసిన రానా తన ప్రామిస్ ని నిలుపుకుంటాడా? అన్నది తెలియాలంటే జూలై 1 వరకు వేచి చూడాల్సిందే. సినీ ప్రియులకు సరికొత్త అనూభూతిని కలిగించనున్నఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి, మానవ హక్కుల నేతగా నందితా దాస్ తో పాటు పలు కీలక పాత్రల్లో సాయి చంద్, జరీనా వాహెబ్, నవీన్ చంద్ర, ఈశ్వరీరావు, నివేదా పేతురాజ్ నటించారు.