జబర్దస్త్ జడ్జ్ లకు బ్రేక్ ?

Update: 2019-04-01 11:46 GMT
ఏమో అదే అంటున్నాయి సినీ టీవీ వర్గాలు. జబర్దస్త్ సక్సెస్ లో పార్టిసిపెంట్స్ చేసే స్కిట్స్ వల్ల ఎంత కామెడీ వస్తుందో దాన్ని లైవ్ గా చూస్తూ ఎంజాయ్ చేసే జడ్జ్ లు నాగబాబు రోజాల వల్ల కూడా అంతే పేరు వచ్చింది. వీరు లేకపోతే షోకు నిండుతనం ఉండదన్న కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఒకరకంగా నాగబాబు టీవీ కెరీర్ ఇన్నింగ్స్ లో ఈ కామెడీ షోనే చాలా పెద్ద బ్రేకు. అయితే ఇకపై వీళ్ళు కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే టాక్ వస్తోంది.

దానికి కారణాలు ఉన్నాయి. నాగబాబు జనసేన తరఫున నరసాపురం ఎంపి క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. మరోవైపు రోజా సిట్టింగ్ ఎమెల్యే హోదాలో నగరి నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున నిలబడుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో యమా బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ఒక్క రోజు కాదు కదా ఒక్క గంట కూడా టీవీ కోసం కేటాయించలేని షెడ్యూల్ లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు

ఈ నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు సీట్ల నుంచి నాగబాబు రోజాలు గెలిస్తే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసి రాజకీయాల వైపే పూర్తి దృష్టి కేంద్రీకరించే ఆలోచనలో ఉన్నారట. మరి రీ ప్లేస్ మెంట్ ఎవరు అనే సందేహం రావొచ్చు. సీనియర్ హీరొయిన్ మీనాతో పాటు జాని లేదా శేఖర్ మాస్టర్లలో ఒకరిని సెట్ చేసే ఛాన్స్ ఉందట.

ఇది అధికారికంగా ప్రకటించకపోయినా ఆల్మోస్ట్ ఓకే అయినట్టు సమాచారం. నాగబాబు రోజాలు లేకుండా కొత్తవాళ్ళు ఎవరు వచ్చినా అది లోటు గానే ఉంటుంది. ఏళ్ళ తరబడి జనం దృష్టిలో జబర్దస్త్ జడ్జ్ లుగా అలా ముద్రపడిపోయిన ఈ ఇద్దరినీ మరిపించేలా మీనా అండ్ మాస్టర్ ఏం చేస్తారో చూడాలి
    

Tags:    

Similar News