'ఆర్ ఆర్ ఆర్ -2' ఉంటుందా? ఉండదా? అన్న అంశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ స్టార్ మేకర్ రాజమౌళి అధికారిక ప్రకటనతో ట్రిపుల్ ఆర్ ఖారారైంది. అంతకు ముందే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆర్ ఆర్ ఆర్ -2 ఉంటుందని ప్రకటించినా? ఎక్కడో ఓ సందేహం వెంటాడేది. కానీ జక్కన్న మౌనం వీడటంతో అన్ని సందేహాలకి తెరపడింది.
ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అన్నది క్లారిటీ లేదు. కానీ కథ మాత్రం రెడీ అవుతుందని అధికారికంగానే ప్రకటించారు. దీంతో రామ్ చరణ్..ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. మరోసారి అభిమాన హీరోల్ని వెండి తెరపై చూసుకుని మురిసిపోవచ్చని సంబరపడుతున్నారు. మొదటి భాగంలో రామ్ చరణ్ పాత్రని హైలైట్ చేసారు కాబట్టి..రెండవ భాగంలో ఎన్టీఆర్ పాత్రిని అంతకంతకు పైకి లేపుతారని..విజయేంద్ర ప్రసాద్ ఆ రకంగా కథ సిద్దం చేస్తున్నారని అభిమానుల్లో ఒకటే ఉత్కంఠత కనిపిస్తుంది.
వాళ్ల అంచనాలు కొంత వరకూ నిజం అవ్వడానికి అవకాశం ఉంది. వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్టీఆర్ పాత్రని చరణ్ ్పాపాత్రకి ధీటుగా తయారు చేయడంలో కొంత వైఫ్యలం కనిపించింది. కానీ అక్కడ ఫరిది దాటడానికి వీలు లేదు కాబట్టి అక్కడితో తారక్ పాత్రకి కన్ క్లూజన్ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి రెండవ భాగంలో తారక్ పాత్రని రెట్టించిన అంచనాలతో డిజైన్ చేయడానికి చాన్స్ ఉందని వస్తోన్న గెస్సింగ్స్ లో తప్పులేదు.
అయితే అభిమానుల అంచనాల్ని..ఆశల్ని జక్కన్న తారు మారు చేసే ఆలోచనలో కూడా ఉన్నారా? అసలు ఆర్ ఆర్ఆ ర్-2 లో హీరోలుగా చరణ్..తారక్ ని మాత్రమే అనుకోవడానికి ఛాన్సెస్ ఎంత వరకూ ఉన్నాయి? ఈ రకమైన ఆలోచనతోనూ జక్కన్న ఉన్నారా? అంటే అవుననే కొత్త వాదన తెరపైకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ ని జక్కన్న ఇతర హీరోలతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు లీకులందుతున్నాయి.
బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ తరహాలో బ్రిటీష్ సామ్రాజ్యం కథని కొన్ని భాగాలుగా తెరకెక్కించాలన్నది ఆయన ప్లాన్ గా సమాచారం. దీనిలో భాగంగా కథలో హీరోల్ని మారిస్తే తప్ప ఫ్రెష్ ఫీల్ కనిపించదని..ఆ కోణంలో చూస్తే 'ఆర్ ఆర్ ఆర్ -2' లో ఇద్దరి హీరోల్ని మార్చేసి కొత్త వారితో జక్కన్న ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు గుస గుస వినిపిస్తుంది.
ఎలాగూ కంటున్యూటీ స్టోరీ కూడా కాదు కాబట్టి పాత్రల పరంగా తెరపై వేరియషన్ కనిపించినప్పటకీ అది ప్రేక్షకులకు కొత్త అనుభూతినే ఇస్తుంది తప్ప! తారక్..చరణ్ అయితేనే న్యాయం చేగలరు అన్న భావన నుంచి బయటకు తీసుకొచ్చేలానే కథ డిజైన్ ఉంటుందని సన్నిహిత వర్గాల నుంచి ఉప్పందింది. అలాగే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్-2 ఉంటుందని ప్రకటించారు గానీ...దాన్ని రామ్ చరణ్...ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఆ కోణంలో ఈ విషయంపై సీరియస్ గా ఆలోచన చేయాల్సిందిగానే కొందరు అంచనా వేస్తున్నారు. మరి సంగతేంటి? అన్నది తేలడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకూ వెయిట్ చేయక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.