గత సంవత్సర కాలంగా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను ఊరిస్తూ వచ్చిన 'సాహో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందినట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు. ప్రభాస్ ఓన్ ప్రొడక్షన్ అవ్వడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయనలో టెన్షన్ కనిపించింది. సాహో ప్రమోషన్స్ సమయంలో చాలా ఒత్తిడిలో ఉన్నట్లుగా.. ఫలితంపై టెన్షన్ గా ఉన్నట్లుగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
భారీ బడ్జెట్ కారణంగా అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తాలకు అమ్మేందుకు ప్రయత్నించారు. కాని కొన్ని ఏరియాల్లో అంత మొత్తం పెట్టేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో సొంతంగానే రిలీజ్ చేశారు. సినిమాకు అయిన బిజినెస్ కాకుండా నిర్మాతలు ఇంకా 30 శాతం రిస్క్ లోనే ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆ మొత్తం రావాలంటే సినిమా బాగా ఆడి భారీగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది.
సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న కారణంగా నిర్మాతలకు వచ్చిన సమస్యే ఏం లేదనిపిస్తుంది. నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ ఖాయం అని.. అయితే సినిమాను కొన్ని ఏరియాల్లో కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్థితి వారం అయితే కాని క్లారిటీ వచ్చేలా లేదు అంటున్నారు. ప్రభాస్ మార్కెట్ భారీగా ఉన్నా 350 కోట్లు అనేది కాస్త పెద్ద అమౌంట్ అనేది అందరి మాట. ఆ మొత్తంను ప్రభాస్ రాబట్టి బయ్యర్లకు సైతం బ్రేక్ ఈవెన్ దక్కేలా చేస్తే సాహో బ్లాక్ బస్టర్ అయినట్లే. మరి నేడే విడుదల అయిన కారణంగా సినిమా ఫలితంపై వారం రోజులు ఆగితే కాని క్లారిటీ రాదు.