ఇక‌నైనా సోనాల్ సీనియ‌ర్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ అవుతుందా?

Update: 2022-10-08 07:43 GMT
సోనాల్ చౌహాన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 'జన్నత్' అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సోనాల్ చౌహాన్‌..  'రైన్‌బో' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'లెజెండ్' వంటి సూపర్ హిట్ మూవీలో నటసింహం నందమూరి బాలకృష్ణ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

లెజెండ్ అనంతరం సోనాల్ తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ అవేమీ ఇక్కడ ఆమె కెరీర్ కు ప్లస్ అవ్వలేకపోయాయి. మొన్నాధ్య ఈ భామ‌ 'ఎఫ్ 3' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన‌ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పోయిన సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

అయితే ఇందులో సోనాల్ కేవలం గ్లామర్ షో మరియు ఒక పాటకు మాత్రమే పరిమితమైంది. దాంతో 'ఎఫ్ 3' వల్ల సోనాల్‌కు ఒరిగిందేమి లేకుండా పోయింది. ఇక రీసెంట్‌గా సోనాల్ చౌహన్ 'ది ఘోస్ట్' మూవీతో వచ్చింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, ప్ర‌ముఖ‌ దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ఇది. దసరా కానుకగా అక్టోబర్ 5న భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేశారు.

టాక్ ఎలా ఉన్నా ఇందులో సోనాల్ పాత్రకు మంచి స్పందన లభించింది. నాగార్జునతో పోటీపడి ఆమె యాక్షన్స్ సన్నివేశాల్లో నటించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చూశాక సీనియర్ హీరోలకు సోనాల్‌ బాగా సూట్ అవుతుందని సినీ ప్రియలెంద‌రో అభిప్రాయ పడుతున్నారు.

టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్‌ను వెతకడం అంటే దర్శక నిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. శృతిహాసన్, తమన్నా, కాజల్ వంటి వారు మినహా ఎవరూ సీనియర్ హీరోలతో నటించేందుకు ముందుకు రావడం లేదు.

ఇలాంటి తరుణంలో సోనాల్ చౌహాన్ తెరపైకి వచ్చింది. సీనియర్ హీరోలకు ఈ బ్యూటీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సోనాల్ సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అవుతుందా..? ఈ విధంగా అయినా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌గా మారుతుందా..? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News