'ద‌స‌రా'తో అయినా ఆయ‌న ద‌శ మారుతుందా?

Update: 2022-12-02 10:34 GMT
టాలీవుడ్ లో గ‌జినీ మ‌హ‌మ్మ‌ద్ లా హిట్టు కోసం కొంత మంది విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. రెండు మూడు సినిమాలు చేసినా స‌క్సెస్ రాలేదంటే ప్రొడ్యూస‌ర్స్ తెర‌మ‌రుగైపోతుంటారు. హీరోలైతే పోయేది ఏమీ లేదు కాబ‌ట్టి ఎప్ప‌టికైనా హిట్టు వ‌స్తుందిలే అని బ్యాక్ టు బ్యాక్ ట్రై చేస్తూనే వుంటారు. అయితే ఓ ప్రొడ్యూస‌ర్ మాత్రం ఫ్లాప్ మీది ఫ్లాప్ ప‌ల‌క‌రిస్తున్నా వెన‌క‌డుగు వేయ‌కుండా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నాడు ఆయ‌నే సుధాక‌ర్ చెరుకూరి.

సందీప్ కిష‌న్, అనిషా ఆంబ్రోస్ జంటగా న‌టించిన 'ర‌న్' మూవీతో ప్రొడ్యూస‌ర్ గా ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోగా తొలి ప్ర‌య‌త్న‌మే షాక్ ఇచ్చింది. భారీ అంచ‌నాలు పెట్టుకున్న తొలి మూవీ ఫ్లాప్ అయినా త‌ను మాత్రం అక్క‌డితో ఆగిపోలేదు.. మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమాలు నిర్మిస్తూ హిట్టు కోసం ట్రై చేస్తూను వున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు శ‌ర్వానంద్ తో 'ప‌డి ప‌డి లేచే మ‌న‌సు', రానా, సాయి ప‌ల్ల‌వితో 'విరాట‌పర్వం' చిత్రాలు చేసినా విజ‌యం ఆయ‌న‌ని ప‌ల‌క‌రించ‌లేదు.

ఇక శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌తో  'ఆడ‌వాళ్లు మీకు జోహార్లు', మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో 'రామా రావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు చేసినా ఆయ‌న‌తో విజ‌యం దోబూచులాడుతూ చెరుకూరి సుధాక‌ర్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతూనే వుంది. ప్ర‌స్తుతం ఆయ‌న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా 'ద‌స‌రా' పేరుతో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీతో శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఉత్త‌ర తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ గోదావ‌రిఖ‌ని కోల్ మైన్స్ నేప‌థ్యంలో సాగే ఊర మాస్ ఎంట‌ర్ టైన‌ర్‌. కొత్త నేప‌థ్యంలో సాగుతూనే ఈ మూవీ ద్వారా ఓ స‌రికొత్త ప్రేమ‌క‌థ‌ని ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల చెప్ప‌బోతున్నాడు.

తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ పాన్ ఇండియా మూవీగా విడుద‌ల కానున్న ఈ సినిమా బ‌డ్జెట్ హీరో నాని మార్కెట్ ని మించి ఖ‌ర్చు చేశార‌ట‌. అయితే ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌, థియేట్రిక‌ల్ బిజినెస్ తో ప్ర‌స్తుతం నిర్మాత సేఫ్ జోన్ లో వున్నాడ‌ని తెలుస్తోంది.

ఐదు సినిమాల‌తో ఫ్లాపుల్ని ఎదుర్కొన్న సుధాక‌ర్ చెరుకూరి 'ద‌స‌రా'పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడ‌ట‌. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి త‌న ద‌శ మారుస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడ‌ట‌. అంతే కాకుండా ఈ మూవీ నిర్మాత‌తో పాటు హీరో నాని, ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓద‌ల‌కు బిగ్ టాస్క్ గా మారిన‌ట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురికి అత్యంత కీల‌కంగా మారిన పాన్ ఇండియా మూవీ 'ద‌స‌రా' వీరి ద‌శ‌ను మారుస్తుందా? .. అన్న‌ది తెలియాలంటే మార్చి 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News