బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో సినిమాకు చాలానే నష్టం జరిగిందంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ మినిమం కూడా రాలేదని.. సినిమా వసూళ్లు ఆమీర్ ఖాన్ కెరీర్ లోనే దారుణంగా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
గతంలో అమీర్ ఖాన్ సినిమా అంటే మినిమం వసూళ్లు నమోదు అయ్యేవి. ఆయన గత చిత్రం ప్లాప్ అయినా కూడా ఓపెనింగ్స్ ఒక మోస్తరుగా వచ్చాయి. కాని ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాకి మాత్రం చాలా తక్కువ వసూళ్లు నమోదు అవ్వడంతో ఆయనకు వ్యతిరేకంగా జరిగిన బ్యాన్ క్యాంపెయిన్ కారణం అయ్యి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
ఆమీర్ ఖాన్ తదుపరి సినిమాలకు కూడా ఇదే పరిస్థితి ఉంటే అప్పుడు ఏంటీ అనేది ఇప్పుడు ప్రశ్న. ఆమీర్ ఖాన్ సినిమాలకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తారా.. వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ఆయన నుండి రావడం అసాధ్యమా అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు సినిమా లో మ్యాటర్ ఉంటే.. మంచి కంటెంట్ తో సినిమా ఉంటే బ్యాన్ లు.. ఐపీఎల్.. వాతావరణం ఏ ఒక్కటి కలెక్షన్స్ కు అడ్డు కాదు అంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. కనుక ఆమీర్ ఖాన్ ముందు ముందు మంచి సినిమాలతో వస్తే ఆయన మార్క్ సినిమాలతో వస్తే మరోసారి దంగల్ రేంజ్ హిట్ ఖాయం అనేది కొందరి అభిప్రాయం.
ఆమీర్ ఖాన్ సినిమాలు మాత్రమే కాకుండా ఇతర స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. కనుక ఇక్కడ సమస్య ఆమీర్ ఖాన్ సినిమా కాదు.. మొత్తం బాలీవుడ్ సమస్య అనేది కొందరి అభిప్రాయం. మరి ముందు ముందు బాలీవుడ్ లో మునుపటి జోరు కలెక్షన్స్ వర్షం నమోదు అయ్యేనా చూడాలి.