బాలయ్య అన్ స్టాపబుల్ రియాల్టీ టాక్ షో ఆహలో ప్రస్తుతం రెండవ సీజన్ నడుస్తోంది. ఈ టాక్ షో బాలయ్య ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. రియల్ బాలక్రిష్ణ ఏంటి అన్నది అందరికీ తెలియచేసింది. సీజన్ వన్ అద్భుతమైన హిట్ అయింది. సీజన్ టూ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో మొదలైంది.
తొలి ఎపిసోడ్ లోనే బాలయ్య తన బావ అయిన చంద్రబాబుని, అల్లుడు లోకేష్ బాబుని పిలిచి మారీ రఫ్ఫాడించే షో చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు మరికొన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. ఇక ఈ సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్ ని మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సెట్ చేస్తున్నారు అని అంటున్నారు. దాని మీద ప్రచారం అయితే మొదలైపోయింది.
ఇక పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో కి రావడానికి ఓకే చెప్పారని అంటున్నారు. దానికి సంబంధించి ఈ నెల 27న కీలకమైన ప్రకటన వస్తుంది అని అంటున్నారు. లాస్ట్ పంచ్ పవన్ ది అయితే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగానే ఇపుడు లాస్ట్ ఎపిసోడ్ లో అటు బాలయ్య, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలసి అటు సినీ ప్రియులనే కాకుండా ఇటు పొలిటికల్ హీట్ పెంచేస్తారా అన్న చర్చ అయితే గట్టిగా ఉంది.
ఇక ఇపుడు ఈ టాక్ షో లో బాలయ్య పవన్ ఇద్దరూ ఏమేమి ముచ్చట్లు మాట్లాడుతారు అన్న దాని మీద నాన్ స్టాప్ గా డిస్కషన్స్ మొదలైపోయాయి. ఇద్దరూ సినీ నటులే. స్టార్లే. కాబట్టి సినిమాల గురించే ఎక్కువగా చర్చలోకి వస్తాయని అనే వారు ఉన్నారు. అయితే పవన్ సినిమా హీరో మాత్రమే కాదు జనసేన అధినేత.
అదే విధంగా బాలయ్య కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నుంచి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే. టీడీపీలో అత్యంత కేలక నాయకుడు. దాంతో కచ్చితంగా రాజకీయాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అదే జరిగితే ఎక్కడ నుంచి మొదలుపెడతారు. ఏమేమి మాట్లాడుతారు అన్నదే ఇక్కడ కీ పాయింట్.
పవన్ కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆ తరువాత సొంతంగా పార్టీని పెట్టారు. రెండు ఎన్నికలను చూశారు. మూడవ ఎన్నికల్లో తానే ఏపీకి కింగ్ అయి సీఎం కావాలనుకుంటున్నారు. మరి పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విముక్త రాష్ట్రం కోసం పోరాడుతామని ఇప్పటికే పవన్ చెబుతూ వస్తున్నారు. దాని అర్ధం ఏమిటి అన్నది కూడా బాలయ్య ఆయన నుంచి మ్యాటర్ లాగుతారా అన్నదే చర్చగా ఉంది.
ఇక తెలుగుదేశంతో పొత్తుల విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తుందా. అంత చాన్స్ పవన్ ఇస్తారా. వ్యూహాత్మకమైన ఎన్నికల ఎత్తులను ఇక్కడ రివీల్ చేస్తారా అన్నది కూడా చూడాలి. మరో విషయం ఏంటి అంటే ఈ మధ్యనే జనసేనలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ అయితే అతి త్వరలోనే తమ పార్టీ రాజకీయ పొత్తుల ఎత్తుల మీద ప్రకటన చేస్తామని చెప్పారు.
మరి ఆ అతి త్వరలో అన్న దానికి అర్ధం కూడా బాలయ్యతో పవన్ భేటీ సందర్భంగా జనాలకు తెలుస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. పొత్తుల విషయం కూడా కమిట్ చేయిస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
ఎలా చూసుకున్నా పవన్ తో బాలయ్య టాక్ షో మాత్రం అటు సినీ ప్రియులతో పాటు ఇటు రాజకీయాల మీద ఇంటరెస్ట్ ఉన్న వారిని కట్టి పడేస్తుంది అని చెప్పాల్సిందే. ఈ ఇద్దరూ కలసి మాట్లాడుకున్న సందర్భం కూడా ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు. అదే టైంలో టాక్ షోలకు రియాల్టీ షోలకు పవన్ ఎపుడూ హాజరు కాలేదు.
దాంతో ఈ టాక్ షో కనుక జరిగితే కచ్చితంగా అది హైప్ పెంచేస్తుంది అని చెప్పాల్సిందే. టీయార్పీ రేటింగ్ ని కూడా తిరగరాస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల జనం ఈ ఎపిసోడ్ కోసం కోట్ల కళ్లతో ఎదురుచూస్తున్నారు అన్నది నిజం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.