టాలీవుడ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనతో సినిమా చేయాలని స్టార్ డైరెక్టర్లే కాదు.. స్టార్ ప్రొడ్యూసర్లు కూడా ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ఆయన రాజకీయల్లోకి రావడం.. పూర్తిస్థాయిలో తన సమయాన్ని రాజకీయాలకు కేటాయించడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదని.. ఇకపై సినిమాలు చేయనని కూడా అయన పలుమార్లు స్పష్టం చేశారు.
అయితే తాజాగా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గతంలో సినిమాలు చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థల వద్ద అడ్వాన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిని ఆయన తన పోల్ అఫిడవిట్ లో కూడా వెల్లడించారు. వాటికి ఆయన తాను తీసుకున్న అప్పు కింద చూపించారు. పలు సందర్భాలలో తనకు ఇతర రాజకీయ నాయకుల్లా బిజినెస్ లు లేవని.. కాంట్రాక్టులు లేవని సినిమాలు మాత్రమే తన ఇన్ కమ్ సోర్స్ అని చెప్పారు. దీంతో పవన్ తిరిగి సినిమాల్లోకి రావడం దాదాపు ఖాయమేనని అంటున్నారు.
ఏపీలో ఎన్నికల హాడావుడి ముగిసింది కాబట్టి పవన్ రీ ఎంట్రీ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఒక సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఇప్పటికే పవన్ తన అంగీకారం తెలిపారని అంటున్నారు. ఎపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు.. రాజకీయ హడావుడి కొంతకాలం ఉంటుంది.. అదంతా సద్దుమణిగిన తర్వాత పవన్ సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు పవన్ 40 రోజుల పాటు డేట్స్ ఇవ్వడానికి అంగీకరించాడని ఈ సినిమాకు పవన్ కు రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ మైత్రీవారు ఆఫర్ చేశారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకుడు.. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది మైత్రీవారు అధికారికంగా ప్రకటించేదాకా తెలియదు.