టాక్ ఎలా ఉన్నప్పటికీ తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లే సాధించింది ‘విన్నర్’ మూవీ. తొలి రోజే రూ.6.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాతి రెండు రోజుల్లోనూ ఓ మోస్తరు వసూళ్లు తెచ్చుకుంది. తొలి వారాంతంలో మొత్తంగా రూ.11.15 కోట్ల షేర్ రాబట్టి సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ వీకెండ్ ఓపెనర్ గా నిలిచింది. ఈ ఊపు చూసి తమ చిత్రాన్ని ‘బాక్సాఫీస్ విన్నర్’ అని ప్రచారం చేసుకుంది చిత్ర బృందం. కానీ వీకెండ్ అయ్యాక సినిమా అసలు సత్తా బయటపడింది. వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా వీక్ అయింది. తొలి మూడు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాతి నాలుగు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఫుల్ రన్లో ఈ సినిమా షేర్ రూ.15-16 కోట్ల మధ్య ఉండొచ్చేమో. అంటే తక్కువలో తక్కువ రూ.10 కోట్లయినా లాస్ తప్పదేమో.
తొలి వారంలో ఏరియాల వారీగా ‘విన్నర్’ షేర్ వివరాలు..
నైజాం-రూ.3.9 కోట్లు
సీడెడ్-రూ.2.1 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.1.45 కోట్లు
గుంటూరు-రూ.1.02 కోట్లు
కృష్ణా- రూ.79 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.85 లక్షలు
తూర్పు గోదావరి-రూ.1.2 కోట్లు
నెల్లూరు-రూ.44 లక్షలు
కర్ణాటక-రూ.1.05 కోట్లు
యుఎస్- రూ.20 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్ రూ.11.73 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.13.15 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
తొలి వారంలో ఏరియాల వారీగా ‘విన్నర్’ షేర్ వివరాలు..
నైజాం-రూ.3.9 కోట్లు
సీడెడ్-రూ.2.1 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.1.45 కోట్లు
గుంటూరు-రూ.1.02 కోట్లు
కృష్ణా- రూ.79 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.85 లక్షలు
తూర్పు గోదావరి-రూ.1.2 కోట్లు
నెల్లూరు-రూ.44 లక్షలు
కర్ణాటక-రూ.1.05 కోట్లు
యుఎస్- రూ.20 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్ రూ.11.73 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.13.15 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/