రొటీన్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎక్కువ కాలం కట్టిపాడేయలేం కాని.. ఒక డీఫాల్ట్ ఫ్యాన్ బేస్ తో వచ్చిన హీరోలకు మాత్రం ఓపెనింగ్ వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర నుండి పెద్ద పెద్ద ఫిగర్లను రాబట్టడం పెద్ద కష్టంకాదు. అందుకే ఇప్పుడు లోకల్ మార్కెట్లో సాయిధరమ్ తేజ్ ''విన్నర్'' విన్ అవుతుంటే.. ఓవర్సీస్ లో మాత్రం లాస్ బాట నడుస్తోంది.
తొలిరోజునే 5.5+ కోట్ల షేర్ వసూలు చేసిన విన్నర్ మూవీ.. ఆ తరువాత రెండో రోజున 2.2+ కోట్లు వసూలు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ లెక్కన చూస్కుంటే ఓపెనింగ్ వీకెండ్ షేర్ ఒక 10 కోట్లు టచ్ అయ్యే ఛాన్సుంది. అయితే అమెరికాలో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. అక్కడ ఇప్పటివరకు కేవలం 18 వేల డాలర్లు మాత్రం వసూలయ్యాయ్. పైగా తెలుగవారిపై అక్కడ జరుగుతున్న వరుస దాడులు, మృతులు తరువాత అక్కడి ఎన్నారై కమ్యూనిటి కాస్త డల్ గా ఉంది. ఈ సమయంలో సినిమాలు ఆడటం కాస్త కష్టమే.
ఇక తెలుగు రాష్ట్రంలలో విన్నర్ సినిమాను 23 కోట్లు రూపాయలు వెచ్చించి కొనగా.. ఓ 7-10 కోట్లు లాస్ తప్పేలా లేదని పరిస్థితిని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్లు. అదే అమెరికాలో అయితే 1.2 కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి.. కలక్షన్లు ఇలాగే ఉంటే మాత్రం ప్రింట్ ఖర్చులు కూడా రికవర్ అవ్వని పరిస్థితి. చూస్తుంటే ఇక్కడ సగం విన్నర్ అయిపోయి అక్కడ పూర్తిగా లూసర్ అయిపోతాడేమో అనే సందేహం వస్తోంది. సోమవారానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/