ఉప్పెన వచ్చి మీద పడిందా.. ప్రళయం కట్టు తప్పిందా.. సునామీ వచ్చి ముంచేసి పోయిందా? అన్నట్టే ఉందీ సీను!! `అవెంజర్స్: ఎండ్ గేమ్` ఊహను మించి.. బాక్సాఫీస్ వద్ద సునామీ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డుల్ని తిరగరాస్తోంది. ట్రేడ్ పండితులు నోళ్లు వెళ్లబెట్టే రిజల్ట్ ని అందుకుంటోంది. తొలి వీకెండ్ నాటికే ఈ సినిమా హాఫ్ బిలియన్ మార్క్ ని అందుకుని తొలి వారాంతానికి 1 బిలియన్ డాలర్ వసూళ్లను దక్కించుకోనుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. 1 బిలియన్ డాలర్ అంటే ప్రస్తుత కరెన్సీలో సుమారు రూ.6,900 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ సమయంలో ఎండ్ గేమ్ సృష్టించబోతున్న ప్రళయం ఇది.
ప్రఖ్యాత ఫోర్బ్స్.. సీఎన్ బీసీ లెక్కల ప్రకారం.. ఎండ్ గేమ్ ఇప్పటికే సుమారు 2800 కోట్లు (400 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. ప్రివ్యూలతోనే ఎండ్ గేమ్ 1186 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతకుముందు `స్టార్ వార్స్ - ది ఫోర్స్ అవేకెన్స్`(2015) అమెరికా కలెక్షన్లలో సృష్టించిన 419 కోట్ల ప్రివ్యూ రికార్డును తుత్తునియలు చేస్తూ అంతకుమించి వసూలు చేసింది.
ఇక చైనాలోనూ ఈ సినిమా రికార్డులతో హోరెత్తించింది. చైనీ బాక్సాఫీస్ వద్ద ఏ ఇతర హాలీవుడ్ సినిమా సృష్టించలేని విధంగా ఓపెనింగ్ డే.. ఓపెనింగ్ వీకెండ్ రికార్డుల్ని సృష్టిస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలోనే ఐదు రోజుల (బుధవారం- ఆదివారం) కు ఈ సినిమా 300 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని.. చైనాలోనూ ఇంచుమించు అంతే పెద్ద మొత్తం (300 మిలియన్ డాలర్లు) వసూలు చేసే వీలుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వసూళ్లను కలుపుకుని 1 బిలియన్ డాలర్ (6900 కోట్లు సుమారు) క్లబ్ లో చేరబోతోందని ఫోర్బ్స్ ఆసక్తికర కథనం వెలువరించింది. ప్రఖ్యాత సీఎన్ బీసీ సైతం ఇదే తరహా గణాంకాల్ని వెలువరించింది. చైనాలో మార్వల్ సంస్థకే చెందిన పలు చిత్రాలు ఇప్పటికే బోలెడన్ని రికార్డులు నెలకొల్పితే అన్ని రికార్డుల్ని అవెంజర్స్ 4 బ్రేక్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఇండియాలోనూ ఈ సినిమా తొలి వీకెండ్ 200-300 కోట్లు వసూలు చేసే వీలుందని అంచనా వేస్తున్నారు.