విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఎన్నో ఆశలు పెట్టుకున్న సీత కూడా నిరాశ పరిచిన నేపథ్యంలో ఆశలన్నీ రాక్షసుడు మీదే పెట్టుకున్నాడు. నెల రోజుల క్రితమే జులై 19 రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ అనూహ్యంగా వరల్డ్ కప్ ఫైనల్ ని దృష్టిలో పెట్టుకుని ఇస్మార్ట్ శంకర్ ఒకరోజు ముందే 18న వస్తుండటంతో రాక్షసుడు టీమ్ పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.
ఒకవేళ వాయిదా వేసుకుని ఆపై వారం వద్దామంటే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సిద్ధంగా ఉన్నాడు. పోనీ అదీ వదిలేద్దాం అనుకుంటే ఆపై ఆగస్ట్ 2న శర్వానంద్ రణరంగం పోరుకు సై అంటోంది. నెక్స్ట్ నాగార్జున మన్మథుడు 2తో చాలా కాన్ఫిడెంట్ గా వస్తున్నాడు. ఇక ఆగస్ట్ 15న వచ్చే సాహోతో జరిగే రచ్చ తెలిసిందే. ఇప్పుడీ లెక్కన రాక్షసుడు వాయిదా వేద్దామన్నా అంత సులభంగా జరిగేలా లేదు. ఆగస్ట్ 23 వరకు స్లాట్స్ ఖాళీ లేవు.
మరీ అంత ఆలస్యం అయితే ఇప్పటికే కుదిరిన బిజినెస్ డీల్స్ ప్రకారం బయ్యర్లు అంత ఆలస్యం అంటే ఒప్పుకోకపోవచ్చు. వారం ముందు వేద్దామంటే జులై 12 న షెడ్యూల్ చేసినవి మూడు నాలుగు ఉన్నాయి. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. దీని గురించిన క్లారిటీ ఇంకో రెండు మూడు రోజుల్లో రావొచ్చు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన తరుణంలో వస్తున్న రాక్షసుడు సోలో రిలీజ్ అయితేనే సాయి శ్రీనివాస్ కు హెల్ప్ అవుతుంది. టైటిల్ కు తగ్గట్టే రిలీజ్ విషయంలోనూ థ్రిల్ కొనసాగేలా ఉంది