అ..ఆ.. చిత్రం రిలీజ్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సింపుల్ స్టోరీని తన మాటలతోనే హ్యాండిల్ చేసేసిన త్రివిక్రమ్ ప్రతిభకు అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. అయితే.. ఈ స్టోరీ కాన్సెప్ట్ విషయంలోనే తేడాలు వస్తున్నాయి. యద్దనపూడి సులోచనా రాణి రాసిన నవల 'మీనా'కు తెరరూపమే అ..ఆ.. అనిపించక మానదు. ఈ విషయాన్ని చాలామందే చెబుతున్నారు.
మరి దీనిపై యద్దనపూడి ఏమనుకుంటున్నారో కూడా తెలియాల్సి ఉంది. నిజానికి తన నవలను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ సినిమా తీయబోతున్నాడన్న సంగతి ఆమెకు ముందుగానే తెలుసట. గతంలోనే మీనా నవల ఆధారంగా ఓ సినిమా వచ్చినా.. మరోసారి త్రివిక్రమ్ ఇలాంటి సినిమా చేయనున్నాడనే సమాచారం ఆమె దగ్గర ఉందట. దీంతో తనకు సినిమాలో నేమ్ క్రెడిట్ ఇస్తారనే ఆమె అనుకున్నారట. కానీ సినిమాలో కానీ.. ఆడియో ఫంక్షన్ లాంటి వేడుకల్లో కానీ.. ఎక్కడా యద్దనపూడి పేరు కూడా చెప్పలేదు త్రివిక్రమ్.
చిన్నపాటి రైటర్లు - డైరెక్టర్ల నుంచి ఇలాంటి స్పందన ఆశించడం కష్టం కానీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే విలువలు బేస్డ్ గా సినిమాలు ఉంటాయి. రియల్ లైఫ్ లో కూడా ఫాలో అయిపోవడం ఈయన స్పెషాలిటీ. మరి యద్దనపూడి సులోచనరాణి లాంటి గొప్ప రచయితకు.. ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు సినీ జనాలు.