దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్యాస్టింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయన తెరకెక్కించిన సినిమాపై ప్రేక్షకులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ అయన నిజజీవిత పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకొనే తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వర్మ ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు నాయుడు పాత్రలు పోషించే నటీనటులను వెల్లడించాడు.
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాలో నటించిన కన్నడ నటి యజ్ఞ శెట్టిని లక్ష్మీ పార్వతి పాత్రకు.. నటుడు శ్రీతేజ్ ను చంద్రబాబు నాయుడి పాత్రకు ఎంచుకున్నాడు ఆర్జీవీ. యజ్ఞ శెట్టి.. శ్రీతేజ్ లు లక్ష్మీ పార్వతి... చంద్రబాబు గెటప్పులలో ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి ఈ రెండు పాత్రలు సినిమాలో చాలా ముఖ్యమైనవి అని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్ ఫోటోలు నాలుగైదు పోస్ట్ చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని.. అయన కళ్ళలో ఏదో ఉందని.. తనదైన స్టైల్లో కామెంట్ పెట్టాడు.
నటుడు శ్రీతేజ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమధ్యే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించాడు. ఇద్దరు భిన్నధృవాల లాంటి రాజకీయనాయకుల పాత్రలను ఇంత తక్కువ గ్యాప్ లో పోషించడం అనే అవకాశం చాలా తక్కువ మంది నటులకు దొరుకుతుంది. అయినా వైఎస్ ను చంద్రబాబుగా మార్చడం అనేది వర్మ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. మరి యజ్ఞ శెట్టి.. శ్రీతేజ్ లు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలంటే ఫిబ్రవరి వరకూ వేచి చూడక తప్పదు.
Full View