ఒక్కోసారి టైం ఇలాగే కలిసొస్తుంది. కోరుకున్న పాత్రలో నటించే అవకాశం.. తమకు నచ్చిన అంశానికి ప్రచారం చేసే అవకాశం.. అందరికీ దక్కే అదృష్టం కాదు. మొదటి టాపిక్ సంగతేమో కానీ.. రెండో విషయంలో మాత్రం యామీ గౌతమ్ కు లక్కు కలిసొచ్చేసింది. తనకు ఎంతగానో ఇష్టమైన ఫుడ్ ఐటెమ్ కి ప్రచారం చేసే అవకాశం దక్కించుకుంది.
నార్త్ ఇండియాలో ఓ పిజ్జా చెయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎండార్స్ మెంట్ కుదుర్చుకుంది యామీ. ఇలా పిజ్జాలకు ప్రచారం చేసే అవకాశం రావడంతో తెగ సంతోషంగా ఉంది ఈ భామ. ఇందుకు కారణం.. యామీకి పిజ్జాలు అంటే ఉన్న విపరీతమైన ఇష్టమే. సహజంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారంతా నోరు కట్టుకోవాల్సి వస్తుంది. డైట్ ఛార్టులను ఫాలో అవాల్సి ఉంటుంది. విపరీతంగా వర్కవుట్స్ చేస్తున్నపుడు ఈ సిట్యుయేషన్ మరీ క్రిటికల్ గా ఉంటుంది. కానీ యామీ గౌతమ్ మాత్రం.. అలాంటి సమయాల్లో కూడా న్యూట్రిషనిస్ట్ లను చీట్ చేేసేసి పిజ్జాలు లాగించేసేదట.
అలాంటిది ఇప్పుడు పిజ్జాలకు ప్రచారం చేసే ఛాన్స్ రావడంతో.. ఉబ్బి తబ్బిబ్బవుతోంది యామీ గౌతమ్. రీసెంట్ గా ఇందుకు సంబంధించిన యాడ్ షూటింగ్ జరగగా.. దీనిలో తన ఫ్యామిలీతో కలిసి పాల్గొంది ఈ భామ. తనకు నచ్చిన స్థాయిలో.. అన్ని రకాల పిజ్జాలు లాగించేశాననిచెబుతోంది యామీ గౌతమ్. నచ్చినవి నోటికి ఉచితంగా అందించడమే కాకుండా.. వాటిని తిని యాక్టింగ్ చేసినందుకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశం అందరికీ రాదులే.