కేజీఎఫ్ రాఖీ భాయ్ గా తెలుగు నాట పాపులరయ్యాడు రాకింగ్ స్టార్ యష్. కన్నడలో అగ్ర హీరోగా రేస్ లోకి దూసుకొచ్చిన యష్ ఓ సామాన్య ఆర్టీసీ డ్రైవర్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ప్రమోషన్స్ లో రాజమౌళి స్వయంగా ఈ సంగతిని చెప్పడం ఉద్విగ్నభరితమైంది.
ఇకపోతే ఇప్పుడు కేజీఎఫ్ సీక్వెల్లో నటిస్తూ నిరంతరం జాతీయ స్థాయిలో హట్ టాపిక్ గా మారాడు యష్. చిత్రీకరణలో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కెజిఎఫ్ చాప్టర్ 2 తో యశ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2021 లో సంక్రాంతి పండుగకు రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని చిత్రయూనిట్ ధృవీకరించాల్సి ఉంటుంది.
కెజిఎఫ్ తరువాత యష్ ఏ సినిమా చేస్తున్నాడు? అన్నదానిపై ఇన్నాళ్లు స్పష్ఠత లేదు. అతడు ఇంకా తన కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజా సంచలనం ఏమిటంటే యష్ తదుపరి టాలీవుడ్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారట. ప్రతిదీ సజావుగా సాగితే దసరా సీజన్లో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. కేజీఎఫ్ 2 ను తెలుగులో విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తారు. ఆయనే కేజీఎఫ్ -తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. సీక్వెల్ ని ఒక ఏరియాలో ఆయన రిలీజ్ చేయనున్నారు. కేజీఎఫ్ హీరో తెలుగు దర్శకుడితో అనగానే ఎవరా స్టార్ డైరెక్టర్ ? అన్న చర్చా మొదలైంది.