'కేజీఎఫ్' ప్రాంచైజీ నుంచి చాప్టర్ -3 ఉంటుందా? ఉండదా? అన్న దానిపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్-1' రిలీజ్ అయిన సమయంలోనో చాప్టర్ -2 కూడా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. చాప్టర్ -1 భారీ సక్సెస్ నేపథ్యంలో చాప్టర్ -2పై రెట్టించ అంచనాలు నెలకున్నాయి. అదే అంచనాలతో రిలీజ్ అయి సంచలనాలు సృష్టించింది. అయితే చాప్టర్ -3 విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. రాకీ భాయ్ పాత్రకి రమీకాసేన్ ప్రభుత్వం ముగింపు పలికినట్లు చూపించారు.
డిఫెన్స్ ఫోర్స్ దాడితో రాకీభాయ్ సామ్రాజ్యాన్ని అంతమొందించినట్లు...రాకీభాయ్ దేశం వదిలి పారిపోతున్నట్లు..ఈ క్రమంలో భారీ నౌకపై త్రివిద దళాల దాడులతో రాకీ భాయ్ అంతమైనట్లు చూపించారు. దీంతో 'కేజీఎఫ్' కథ ఇక్కడితో ముగిసినట్లేనని దాదాపు అంతా ఓ అంచనాకి వచ్చారు. అయితే 'కేజీఎఫ్' లో చెప్పాల్సిన కథ ఇంకా ఉంది. గేట్ -3 దగ్గర నుంచి గేట్ -9 వరకూ ఇంకా చాలా మిస్టరీ ఉందన్నది కల్పిత కథలో అర్ధమవుతుంది.
రాకీభాయ్ అధీరాని అంతమొందించినప్పటికీ 'కేజీఎఫ్' సామ్రాజ్యంలో ఎంత మంది గరుడాలైనా..అధీరాలైనా సృష్టించడానికి వీలుంది. ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ వరకూ చాలా పాత్రల్ని క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉందన్నది విశ్లేషకుల మాట. ఆ సంగతి పక్కనబెడితే 'కేజీఎఫ్ -3' అస్పష్టతో ఉన్నప్పటికీ చాప్టర్ -3 కోసం పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది అన్నది వాస్తవం. 'కేజీఎఫ్ -3' రిలీజ్ కోసం ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది.
అయితే ఆ ఎగ్జైట్ మెంట్ పై ఏమాత్రం నీళ్లు చల్లకుండా యశ్ చాప్టర్ -3 పై క్లారిటీ ఇచ్చేసారు. ఓ హాలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ''కేజీఎఫ్ గురించి ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా చాలా కథ ఉంది. అందువల్ల చాప్టర్ -3కి అవకాశం ఉందని కచ్చితంగా చెప్పగలను. 'కేజీఎఫ్-2' సెట్స్ లో ఉన్నప్పుడే ప్రేక్షకులకి కథని ఒక్క భాగంలో చెప్పలేమని అర్ధమైంది.
పార్ట్ -3 బయటకు వచ్చేలా..తగినన్ని భాగాలు..క్లూస్ వదిలాము. ప్రస్తుతానికి చాప్టర్ -2ని ఆస్వాదించండి. కచ్చితంగా చాప్టర్ -3 ఉంటుంది. కానీ అది ఎప్పుడు అన్నది కచ్చితంగా చెప్పలేను' అని వెల్లడించారు. దీంతో చాప్టర్ -3 ఉంటుందని ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ మూడవ భాగం ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలకు యశ్ పుల్ స్టపా్ పెట్టేసారు.
'కేజీఎఫ్' ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ చెప్పేసారు. అలాగే 'ఆర్ ఆర్ ఆర్' ..'కేజీఎఫ్' చిత్రాలు ఇండియన్ సినిమా వైభవాన్ని చాటుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు మన భూభాగం. రెండు చిత్రాలు దేశీయ సామార్ధ్యాన్ని మెరుగు పరిచాయి. త్వరలో వరల్డ్ల బాక్సాఫీస్ నే షేక్ చేస్తామని ధీమా వ్యక్తం చేసారు.