#మీటూ : ఇప్పుడు దేవరకొండ హీరోయిన్‌ వంతు

Update: 2018-10-29 06:17 GMT
బాలీవుడ్‌ లో రాజుకున్న మీటూ ఉద్యమం మెల్ల మెల్లగా సౌత్‌ లో కూడా రాజుకుంటుంది. కన్నడ, తమిళ సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమం తాలూకు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కన్నడ సినిమా పరిశ్రమలో స్టార్‌ హీరో అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇతర హీరోలు కూడా కాస్త టెన్షన్‌ పడుతున్నారు. తమ ప్రమేయం లేకుండానే ఎక్కడ హీరోయిన్స్‌ తమపై ఆరోపణలు చేస్తారో అంటూ భయపడుతున్న సమయంలో తాజాగా మరో తమిళ హీరోయిన్‌ మీటూ అంటూ ముందుకు వచ్చింది.

తమిళ హీరోయిన్‌ యాషిక ఆనంద్‌ ఇప్పుడు మీటూ అంటూ ఒక దర్శకుడిపై లైంగిక ఆరోపణలు చేసింది. అయితే ఆ దర్శకుడి పేరును మాత్రం ఆమె చెప్పలేదు. తాను నటించిన సినిమా దర్శకుడు నన్ను లైంగికంగా వేదించేందుకు ప్రయత్నించాడు, కాని అతడు నన్ను డైరెక్ట్‌ గా అప్రోచ్‌ కాకుండా, ఇండైరెక్ట్‌ గా తనకు ఆ ఆలోచన ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ విషయం గమనించి నేను అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాను. నా ప్రవర్తన చూసిన అతడు కాస్త దూరం మెయింటెన్‌ చేశాడని చెప్పుకొచ్చింది.

యాషిక ఆనంద్‌ చెప్పిన ఆ దర్శకుడు ఎవరై ఉంటారా అంటూ ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. విజయ్‌ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన యాషిక ఆనంద్‌ కు పెద్దగా పేరు రాలేదు. అయితే అంతకు ముందు నటించిన తమిళ చిత్రం ‘దురువంగల్‌ పతినరు’ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ చిత్రంతో ప్రస్తుతం తమిళంలో రెండు మూడు సినిమా ఛాన్స్‌ లు ఆమె చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అవి సెట్స్‌ పైకి వెళ్లబోతున్నాయి. ఇలాంటి సమయంలో యాషిక చేసిన మీటూ ఆరోపణలు పబ్లిసిటీ కోసమే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News