ఒక్కోసారి మంచి వ్యాఖ్య చేసినా అది చెడుగానే వినిపిస్తుంది. ఆ వ్యాఖ్య ను పాజిటివ్ గా అర్థం చేసుకుంటే ఓకే కానీ, నెగెటివ్ గా అర్థం చేసుకుంటేనే చిక్కు. సౌండింగ్ తేడాగా వినబడితేనే అసలే పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. నేడు ఓ మీడియా మీట్ లో రాజు గారు చేసిన వ్యాఖ్య కాస్త సౌండింగ్ తేడాగానే వినిపించింది. ``ఏదైనా సినిమా హిట్టవ్వాలంటే ఈ రోజుల్లో ఓపెనింగులు రావాల్సిందే. ఓపెనింగులు ఉంటేనే అది విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది`` అని అన్నారు.
ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్న యాత్ర సైతం ఓపెనింగులు రాబడితేనే హిట్టు కొడుతుందని రాజుగారు చెప్పకనే చెప్పారు. ఆసక్తికరంగా ఈ సినిమాని వైజాగ్, నైజాం ఏరియాల్లో దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. అసలే డిస్ట్రి బ్యూషన్ లో ఆయన పూర్తిగా లెంపకాయలు తింటున్నారు. సరిగా గిట్టు బాటు కాలేదని ఆయనే వేదికలపై ప్రకటిస్తున్నారు. 2.0 మొదలు .. ప్రతిదీ తనకు నష్టాల్నే మిగిల్చాయని ఒప్పుకున్నారు. ఇకపోతే .. ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి బరిలో ఘనవిజయం సాధించకపోయి ఉంటే రాజుగారి సన్నివేశం ఊహించలేనిది. ఆ సినిమా తెచ్చిన లాభాలతోనే ఇతరత్రా వచ్చిన నష్టాల్ని తట్టుకోగలిగారన్న విశ్లేషణ సాగుతోంది.
తాజాగా వైయస్సార్ జీవితకథలో పాదయాత్ర ఎపిసోడ్స్ తో తెరకెక్కించిన యాత్ర చిత్రాన్ని దిల్ రాజు నైజాం, వైజాగ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ శుభ సందర్భ ంగా రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా తన కార్యాలయంలో విలేకరులతో ముచ్చటించిన ఆయన .. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అని అంటే తర్వాత బావుండేది. ఇప్పుడు అలా కాదు. ఓపెనింగ్ తీసుకుంటేనే నిలబడుతున్నాయి.. అంటూ వ్యాఖ్యానించరు. యాత్ర విక్టరీ గురించి ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నానని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర పేపర్లు, టీవీల్లో చూశాం కానీ నేరుగా చూడలేదు. పాదయాత్రతోనే రాజశేఖర్ రెడ్డి హీరో అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జనాల కోసం ఏదైనా చేస్తాడు ఓ నాయకుడు అని రాజశేఖర్‌రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుని చూపించారు. ఎన్టీఆర్ తర్వాత మన రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ బిల్డ్ అయింది రాజశేఖర్‌రెడ్డికే... అని అన్నారు దిల్ రాజు. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా యాత్రి రిలీజవుతోంది. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి మహి.వి.రాఘవ్ దర్శకత్వ ం వహించగా విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మించారు.