ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో - ఎలక్ట్రానిక్ మీడియాలో లైంగిక వేదింపుల గురించిన వార్తలు కుప్పలు తెప్పలుగా చూస్తూనే ఉన్నాం - వింటూనే ఉన్నాం. సోషల్ మీడియా పవర్ ఫుల్ అవ్వడంతో పాటు అమ్మాయిల్లో ధైర్యం పెరగడంతో ఎవరైనా లైంగికంగా వేదిస్తే ధైర్యంగా ముందుకు వచ్చి న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం మాత్రం అమ్మాయిల్లో - ఆడవారిలో ఇంత తెగువ లేదు. వర్క్ ప్లేస్ లో ఎవరైనా వేదిస్తే ఆ జాబ్ మానేయడం లేదా సర్దుకు పోవడం చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అయితే మహిళ జర్నలిస్ అయిన అకిలా మాత్రం గత అయిదు సంవత్సరాలుగా తనపై జరిగిన లైంగిక వేదింపులకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంది.
ప్రస్తుతం ఇండియాలో మీటూ ఉద్యమం సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో ఈ ప్రపంచానికి అకిలా విషయం తెలిసింది. ఇన్నాళ్లు పూర్తి చెన్నైకు కూడా ఈ విషయం తెలిసేది కాదు. కాని మీటూ ఉద్యమం నేపథ్యంలో అకిలాకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. మరో మూడు నెలల్లో కేసు విచారణ పూర్తి అవుతుందని, తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డ తన సీనియర్ కు శిక్ష పడుతుందనే నమ్మకంతో అకిలా ఉంది.
అకిలా గురించి పూర్తి వివరాలు ఆమె మాటల్లో.. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ ప్రముఖ న్యూస్ ఛానెల్ అయిన సన్ టీవీ న్యూస్ ఛానెల్ లో నేను జర్నలిస్ట్ కం న్యూస్ ప్రజెంటర్ గా జాబ్ చేసేదాన్ని. నాతో సీనియర్ వీ రాజా న్యూస్ రూంలో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. తనతో తప్పుగా మాట్లాడటంతో పాటు, తనకు సహకరించాల్సిందిగా కోరేవాడు. నేను ససేమేరా అనడంతో నన్ను ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టాడు. నాకు కఠినమైన షిప్ట్‌లు వేయడంతో పాటు, బదిలీ చేస్తాను అంటూ బెదిరించేవాడు.
లైంగిక వేదింపులు బరించలేక వి రాజాపై 2014వ సంవత్సరంలో కేసు పెట్టాను. ఆ సమయంలో నాకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన వారిని భయపెట్టి, ప్రలోభ పెట్టి అతడి వైపుకు తిప్పుకున్నాడు. రాజాకు వారు మద్దతుగా మాట్లాడటం నాకు మరింత బాధను కలిగించింది. దాంతో వారిపై కూడా పరువు నష్టం దావా వేశాను. నేను పెళ్లి చేసుకుని, గర్బవతి అయినా కూడా కోర్టు మెట్లు ఎక్కాను, నా పాపాయిని ఎత్తుకుని కూడా కోర్టుకు హాజరు అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.
అకిలాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయంకు తప్పకుండా న్యాయం జరగాలని అంతా కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి ఎంతో మంది అమ్మాయిలకు అకిలా ఒక ఆదర్శనీయ మహిళగా నిలిచింది. లైంగిక వేదింపులను సహించ వద్దని, ఏమాత్రం భయపడకుండా బయటకు రావాలని అకిలా ఇతరులకు కూడా సూచిస్తోంది.