గాయం .. గాయం .. గాయం! అసలింతకీ గాయాలు ప్రమాదాలు లేకుండా షూటింగ్ ఉంటుందా? అయినా ఈ ప్రచారమేంటి? ఇందులో నిజం ఎంత? అట్నుంచి ఏమాత్రం క్లారిటీ లేకపోయినా.. అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినా మీడియాలో మాత్రం దీనిపై ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో గాయాలు అంటూ రకరకాలుగా ప్రచారం అవుతోంది. ఒకసారి చరణ్.. ఇంకోసారి తారక్ గాయపడ్డారు ఆరంభంలో. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరిపై అదే తరహా ప్రచారం సాగుతోంది.
మొన్ననే చరణ్ గాయపడ్డాడని ప్రచారమైంది. పూణే షెడ్యూల్ లో గాయం అయ్యిందని అయితే వెంటనే కోలుకున్న చరణ్ షూటింగ్ కి అంతరాయం కానివ్వకుండానే సహకరించాడని ప్రచారమైంది. అటుపై అందులో ఎలాంటి వాస్తవం లేదని షూటింగ్ కి ఎలాంటి ఆటంకం కలగలేదని దానయ్య టీమ్ కూడా వివరణ ఇచ్చింది. అది సరే.. ఇంతలోనే మరో గాయం.. ఈసారి ఎన్టీఆర్ కి గాయం అంటూ ప్రచారం సాగుతోంది. కాస్తంత అడ్వాన్స్ డ్ గా వెళ్లి తమిళనాడులో 35 రోజుల షెడ్యూల్ కి ఏమవుతుందో అంటూ ఆందోళన మీడియాలో వ్యక్తం చేయడం చర్చకు వచ్చింది. ఈసారి షెడ్యూల్ అంతా తారక్ పైనే ఉంటుంది. అలాంటప్పుడు గాయం ఆందోళనకరమేనని ప్రచారమవుతోంది.
ఇంతకీ ఇందులో నిజం ఎంత? దీనిపై ఇప్పటివరకూ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ మీడియా స్పందించనే లేదు. అయిన దానికి కానిదానికి డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సోషల్ మీడియా బోలెడన్ని ట్వీట్లిస్తుంది. దీనిపై ఎందుకు స్పందించడం లేదు. సొంత మీడియా ఉండగా ఆళ్లు ఈళ్లు అనేవి ఎందుకు నమ్మడం. అక్కడ అధికారికంగా ఏదైనా నిజం చెబితే అభిమానులు కంగారు పడరు కదా? ఫైట్ సీన్స్ లో గాయాలు సహజమే. ఆర్.ఆర్.ఆర్ లో పోరాట సన్నివేశాల్ని రాజమౌళి తనదైన మార్క్ తో తెరకెక్కిస్తున్నారన్న సమాచారం ఉంది. మరి ఈసారి గాయం ఎలా అయ్యింది? ఇందులో నిజం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో వీరాధివీరులైన అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ పాత్రల్ని రాజమౌళి ఎలా చూపించబోతున్నారు? అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. అందుకోసమే హీరోలు రిస్క్ అయినా ఇలా అన్నిటికీ తెగిస్తున్నారని భావించాల్సి ఉంటుంది.