కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదల తేదీల్లో గందరగోళం ఏర్పడింది. సంక్రాంతి సందర్భంగా రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడటంతో.. ఆల్రెడీ సమ్మర్ సీజన్ కోసం కర్చీఫ్ వేసుకున్న చిత్రాలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని కుదిరితే మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అయితే అదే తేదీన దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 3' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇలా పెద్ద సినిమా వల్ల ఇతర చిత్రాల రిలీజులకు ఇబ్బంది కలుగుతోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియా సమావేశంలో సమ్మర్ రిలీజులు మరియు డేట్స్ క్లాష్ గురించి మాట్లాడారు.
''నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అంతా నార్మల్ అవుతుంది. అందరూ ప్రిపేర్ అవుతున్నారు. పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి 25 నుంచి స్టార్ట్ అయిపోతాయని అనుకుంటున్నాను. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే.. ఇలా సమ్మర్ లోపు అన్ని బిగ్ ఫిలిమ్స్ వచ్చేస్తాయి'' అని దిల్ రాజు అన్నారు. ఒక పెద్ద సినిమా రావాలనుకున్నప్పుడు అందరూ ఎక్కడో ఒకచోట అండర్ స్టాండింగ్ కి రావాలని తెలిపారు.
''ప్రొడ్యూసర్స్ గా అన్ని పరిశీలించి విడుదల తేదీలను లాక్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ లో ప్రాక్టీగల్ గా ఆలోచించాల్సి ఉంటుంది. మేం ఫిక్స్ అయ్యాం కదా.. వస్తాం అంటే కుదరదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి RRR కోసం రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్నారు. మార్చి 18వ వరకు మార్కెట్ ఓపెన్ అవకపోతే రిలీజ్ కాదు. ఇంక మిగిలింది ఏప్రిల్ 28. అదే తేదీన నేను 'ఎఫ్ 3' చిత్రాన్ని అనౌన్స్ చేసి ఉన్నా. RRR అక్కడికి వస్తా అంటే నేను త్యాగం చెయ్యాల్సిందే.. నేను ఇంకో డేట్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే RRR అనేది పాన్ ఇండియా మూవీ. అంత పెద్ద సినిమా కోసం వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను కాదనలేను'' అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
''రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ వస్తే లీడ్ తీసుకోవడానికి నేనెవరిని? ఇండస్ట్రీలో నేనూ ఒకరిని అంతే. నేను చెప్తే జరుగుతుందా?. అందరం కలిసి కూర్చొని మాట్లాడువాల్సి ఉంటుంది. ఏది ఎలా చేద్దాం అని ఫైనల్ గా మాట్లాడటం అనేది నా దగ్గరకు వస్తుంది అంతే. ముందుగా ఎన్ని డేట్స్ అనుకున్నా ఫైనల్ గా ఇండస్ట్రీలో అందరం ఒక అండర్ స్టాండింగ్ కి రావాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి అన్నీ మారుతూ ఉంటాయి'' అని అగ్ర నిర్మాత అన్నారు.
ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ.. నార్మల్ పరిస్థితి ఉండుంటే 'రౌడీ బాయ్స్' చిత్రానికి ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్స్ తెచ్చుకునేవాడినని అన్నారు. టైం లేక పాటలు రిలీజ్ చేసుకోలేకపోయామని.. 'బంగార్రాజు' లాంటి సినిమా మీద డైరెక్ట్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. పాండమిక్ వల్ల జనాలు బయటకురాలేని క్రూషియల్ టైమ్ లో సినిమాని రిలీజ్ చేశామని.. పరిస్థితులు బాగుంటే సినిమాని జనాలకు రీచ్ అయ్యేలా ప్రాపర్ ప్లానింగ్ తో విడుదల చేసేవాళ్ళమని దిల్ రాజు పేర్కొన్నారు.