ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు ఓ రేంజ్ ఉంది. బాహుబలి.. సాహో సినిమా ల తర్వాత ఆయన నుండి సినిమా అంటే ప్రేక్షకులు ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కథ కాస్టింగ్ నుండి మొదలుకుని టెక్నీషియన్స్.. వాడే టెక్నాలజీ ఇలా అన్ని కూడా అత్యంత అద్బుతం అయ్యి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అలాగే ఉన్నాయి. రాధే శ్యామ్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. దాంతో పాటు ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు బాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా హాలీవుడ్ సినిమా రేంజ్ లో విజువల్ వండర్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలన్నింటిని మించి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న సినిమా నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.
మహానటి సినిమా తో సూపర్ హిట్ ను కొట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అద్బుతంగా సినిమాను తెరకెక్కించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గానే ప్రేక్షకులు చూశారు. ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గానే విడుదల అయ్యాయి. కాని తాను చేయబోతున్న సినిమా మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటుందని అంటున్నాడు. ఆయన కథ నుండి మొదలుకుని టెక్నికల్ అంశాల వరకు అన్నింటిని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ఆలస్యం అవుతున్నా కొద్ది అదనపు హంగులను నాగ్ అశ్విన్ అద్దుతున్నాడు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన ఈ సినిమా షూటింగ్ కు అత్యంత అరుదైన ఖరీదైన ఎరీ అలెక్సా 65 లెన్స్ ను వాడబోతున్నాడట. హాలీవుడ్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలకు ఈ లెన్స్ ను వాడారు. ఇటీవల వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మరియు ఇతర హాలీవుడ్ సినిమాలను కూడా ఈ లెన్స్ తోనే చిత్రీకరించారు.
ప్రభాస్.. నాగ్ అశ్విన్ ల కాంబోలో రూపొందబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి వినియోగించబోతున్న ఏరీ అలెక్సా 65 లెన్స్ ఖరీదు 1.5 లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 12 కోట్లుగా చెబుతున్నారు. అంత ఖరీదైన లెన్స్ ను వాడబోతున్న నేపథ్యంలో సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ను కూడా అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతోనే చేయించబోతున్నారట. మొత్తానికి ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలోనే ఈ సినిమా అరుదైన సినిమాగా నిలుస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా మొదలు అయితే 2023 కు విడుదల అయ్యేనో చూడాలి.