యువ హీరో '#NS22' షూటింగ్ మళ్ళీ మొదలైంది..!

Update: 2021-07-13 07:06 GMT
హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను చాలా రోజుల తర్వాత తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్‌ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో నాగ శౌర్య - షిర్లీ సెటియా మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. '#NS22' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ఓ ఉల్లాసవంతమైన పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో నాగ శౌర్య తన తల్లి ఉషా ని పట్టుకొని హీరోయిన్ షిర్లీ సెటియా - డైరెక్టర్ అనీష్ లతో కలిసి చిరు నవ్వులు చిందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ నాల్గవ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. రామ్‌ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇకపోతే యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం 'లక్ష్య' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇండియాలో ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి సినిమా ఇది. ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయింది. ఇదే క్రమంలో 'వరుడు కావలెను' - 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాలు చేస్తున్నారు. అలానే 'పోలీసు వారి హెచ్చరిక' మరియు శ్రీమాన్ దర్శకత్వంలో '#NS24' సినిమాలను లైన్ లో పెట్టాడు శౌర్య.
Tags:    

Similar News