ఇండియన్ సూపర్ హీరో సినిమాల పాన్-ఇండియా భాగస్వామ్య విశ్వం సృష్టించాలన్న ఆలోచనే ఆసక్తికరం. అలాంటి ఆలోచనతో ప్రయోగాల బాటలో విజయాలు అందుకుంటున్న దర్శకుడిగా ప్రశాంత్ వర్మకు గుర్తింపు ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో అతడు `హను-మాన్` విశ్వానికి శ్రీకారం చుట్టాడు. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన `హను-మాన్` తెలుగు -హిందీ సహా ఇతర భాషల్లోను విడుదల కానుంది. నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా అద్భుతమైన కంటెంట్ తో రూపొందుతున్న చిత్రమిదని ప్రచారం సాగుతోంది.
ఈ సినిమా టీజర్ తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో తొలి ఇంప్రెషన్ కొట్టేయడంలో ప్రశాంత్ వర్మ విజయం సాధించారు. హనుమంతుని సన్నిధి అందరిలో ఉత్కంఠను కలిగించింది. ప్రశాంత్ వర్మ విజన్ ని ప్రజలు కొనియాడారు. తేజ సజ్జ సూపర్ హీరోగా మంచి ముద్ర వేసాడు.
మరోవైపు హను-మాన్ టీమ్ ముంబైలో కీలకమైన నీటి అడుగున సన్నివేశం షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనిని గ్రాండ్ కాన్వాస్ పై తెరకెక్కిస్తున్నారని సమాచారం. తేజ సజ్జ తనవంతు బెస్ట్ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా రిలీజైన పోస్టర్ లో తేజ సజ్జా నీటిలో సన్నివేశంలో నటిస్తూ కనిపించాడు.
రాజమౌళి - RRR .. ఆర్.సి 15 కోసం కూడా గతంలో ఇదే బృందంతో ఇలాంటి సన్నివేశాన్ని రూపొందించారు. పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న ప్రశాంత్ వర్మ ఈ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లో తేజ సజ్జా కి పదిహేను రోజుల పాటు స్పెషల్ ట్రైనర్ దగ్గర శిక్షణ ఇప్పించాడు . ఇది చేయడం చాలా కష్టమైనదని తెలిసింది.
అంతేకాదు.. ఇది చాలా ప్రమాదకరమైన సీక్వెన్స్. దీనికోసం ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున కథానాయకుడు ఉండవలసి ఉంటుంది. కానీ తేజ సజ్జా దానిని పట్టుదలతో ఆచరించాడు. సన్నివేశం అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. ఈ సన్నివేశంలో ఔట్ పుట్ ప్రేక్షకుడిని ఉలిక్కిపడేలా చేస్తుందని చెబుతున్నారు. టీజర్ సినిమాపై స్కై-హై అంచనాలను నెలకొల్పింది. అండర్ వాటర్ సీక్వెన్స్ గురించిన తాజా ప్రచారంతో పెద్ద స్క్రీన్ పై సినిమాను చూడాలనే ఉత్సాహం రెట్టింపైంది.
శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, ..అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.