మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. నటుడిగా వైష్ణవ్ మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. అటుపై 'కొండపొలం' అనే డిఫరెంట్ జానర్ సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా రెండు డిఫరెంట్ జానర్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసుకోవడం యంగ్ హీరో ప్రత్యేకతగా చెప్పొచ్చు.
టాలీవుడ్ లో ప్రామిసింగ్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఇలా రెండు విజయాలు..మెగా మెగా ఇమేజ్ తో యంగ్ హీరో బాగానే అవకాశాలు అందుకుంటున్నాడని ట్రాక్ చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్-ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇది పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ అని సమాచారం. వరుణ్ మాస్ లుక్ ని కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా మేకోవర్ ఆకట్టుకుంటుందని టాక్ . దీన్ని బట్టి వైష్ణవ్ కెరీర్ విషయంలో చాలా ప్రణాళికబద్దంగా ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. మొదటి రెండు చిత్రాల్లో బెస్ట్ పెర్పార్మెన్స్ ఇచ్చాడు. 'ఉప్పెన' పక్కనబెడితే 'కొండపొలం' పూర్తిగా డిఫరెంట్ జానర్ సినిమా.
అందులో పాత్రలు...నేపథ్యం మాత్రమే హైలైట్ అవుతుంది. నటనపై పరిపక్వతని పెంచే చిత్రం తప్ప కమర్శియల్ చిత్రం కాదు. ఇక 'ఉప్పెన' కమర్శియల్ హంగులతో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర వైష్ణవ్ ని హైలైట్ చేసింది.
అయితే రెండు సినిమాల్లో వైష్ణవ్ ఎక్కడా కమర్శియల్ స్టార్ గా హైలైట్ చేయాలని ప్రయత్నించలేదు. అందుకే ఇప్పుడు ఆ రకమైన పాత్రపై మనసు మళ్లించినట్లు కనిపిస్తుంది. ఒకే జానర్ సినిమాలకు పరిమితైతే అదీ ఒక రకమైన రిస్క్ అవుతుంది.
ఆ విషయాన్ని వైష్ణవ్ త్వరగానే గుర్తించాడు. అందుకే తెలివైన నిర్ణయాలతో సినిమా- సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ వేలో కెరీర్ ని ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ విషయంలో అన్నయ్య సాయితేజ్ కంటే వైష్ణవ్ బెటర్ అనే చెప్పాలి. అలాగే వైష్ణవ్ తో అన్నపూర్ణ స్టూడియో స్..జీఏ-2 బ్యానర్స్ కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. వైష్ణవ్ కోసం సరైన కథల అన్వేషణలో సదరు బ్యానర్లు రెండు ఉన్నట్లు సమాచారం.