కుర్ర హీరోలకు వర్కౌట్ అవుతుందా?

Update: 2019-08-24 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో తమిళ రీమేక్స్ ఎక్కువవుతున్నాయి. కుర్ర హీరోలు సైతం రీమేక్ సినిమాల మీదే డిపెండ్ అవుతున్నారు. శర్వానంద్ '96' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంటే - రామ్ 'తడం' సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి తమిళ్ లో ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అందుకే ఈ సినిమాలను భారీ డిమాండ్ మధ్య రైట్స్ దక్కించుకున్నారు మన నిర్మాతలు.

శర్వా '96' రీమేక్ ఇప్పటికే అరవై శాతం పూర్తయింది. ఈ సినిమాను ఒరిజినల్ దర్శకుడు ప్రేమ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేమ్ తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిజానికి ఎక్కడైనా తేడా కొడుతుందమో అన్న డౌట్ తో ప్రేమ్ ని దర్శకుడిగా ఫైనల్ చేసాడు దిల్ రాజు. ఇక రామ్ 'తడం' రీమేక్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు డైలాగ్స్ తో పాటు కథలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సినిమాను కిషోర్ తిరుమల చేతిలో పెట్టాడు రామ్. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ రీమేక్ పై మంచి అంచనాలున్నాయి.

నిజానికి తెలుగులో ఇప్పుడు తమిళ్ రీమేక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. 'రాక్షసుడు' మినహా మరే రీమేక్ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. మరి ఈ టైంలో శర్వా, రామ్ కొంత రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఈ రీమేక్ సినిమాలతో ఈ కుర్ర హీరోలు ఎలాంటి హిట్ అందుకుంటారో తెలియాలంటే ఇంకొన్ని నెలలు గడవాల్సిందే.


Tags:    

Similar News