వారసుల కోరిక తీర్చడం కోసం తల్లిదండ్రులు కష్టపడడం.. బడాబాబులు అయితే కోట్లు కుమ్మరించడం కామన్ విషమయే. అయితే.. గతంలో మాదిరిగా కాకుండా.. ఇప్పుడు సినిమా హీరో అయిపోవాలని భావించే వారి సంఖ్య బాగానే పెరిగింది. పాలిటిక్స్ లో ఉన్నవారి నుంచి వ్యాపారాల్లో ఆరితేరిన వారి వారసులు కూడా ఫిలిం ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే.. వీరిలో ఎందరు సినిమాలకు పూర్తి శిక్షణ పొంది వస్తున్నారన్నదే అసలు విషయం.
తాజాగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా జయదేవ్ అనే చిత్రం వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్ గా చిరంజీవితో ఫస్ట్ లుక్ లాంఛ్ చేయించిన శరభ మూవీలో హీరోగా నటించిన ఆకాష్ సహదేవ్ ఇలాగే పరిచయం అవుతున్నాడు. ఇండియా-దుబాయ్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఓ బిజినెస్ మ్యాన్ కుమారుడే ఈ ఆకాష్. కొత్త కుర్రాడి కోసం సోషియో ఫ్యాంటసీ జోనర్ లో వస్తున్న ఈ మూవీపై ఏకంగా 50 కోట్లు పెట్టేశారనే టాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్స్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి కుమారుడు రక్షిత్ కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. లండన్ బాబులు ఈ మూవీ టైటిల్. మారుతి నిర్మాణంలో చిన్నికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కడం విశేషం. ప్రొడ్యూసర్ శైలేంద్ర బాబు కుమారుడు సుమంత్.. మరో నిర్మాత కృష్ణా రెడ్డి కుమారుడు నాగ అన్వేష్ కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు.
ఇండస్ట్రీకి సంబంధం ఉన్నా లేకపోయినా.. ఉత్సాహంగా కోట్లు కుమ్మరించి సినిమాల్లోకి వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే.. వీరంతా సరైన ట్రైనింగ్ తో వస్తే.. ఇండస్ట్రీకి కొత్త హీరోలు లభిస్తారు. కానీ అలా జరుగుతున్న ఛాయలు పెద్దగా కనిపించడం లేదు. అరా కొరా యాక్టింగ్ ట్రైనింగ్ తో సరిపెట్టేసుకుని.. కోట్లు కుమ్మరించగలగడం ఒక్కటే క్వాలిఫికేషన్ తో రావడమే ఆలోచించాల్సిన విషయం. ఎలాగూ భారీగా పెట్టుబడి చేయగల కెపాసిటీ ఉన్నవారే కాబట్టి.. ముందుగా తగినంత శిక్షణ తీసుకుని పరిశ్రమలోకి రావాలని.. అపుడు తెలుగు సినీ పరిశ్రమలోకి కూడా నవతరం హీరోలు లభిస్తారని టాలీవుడ్ సీనియర్లు అంటున్నారు.