ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో డజను మంది అగ్ర హీరోలు 15-25 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్నారు. ఒక్కో హీరో సక్సెస్ రేంజును బట్టి ఈ పారితోషికాల రేంజ్ మారుతోంది. కొందరు స్టార్ హీరోలు పారితోషికంతో పాటు కొన్ని ఏరియాల రిలీజ్ హక్కుల్ని ఒప్పందంలో రాయించుకుంటున్నారు. మహేష్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్- ప్రభాస్- అల్లు అర్జున్ .. వీళ్లందరిదీ ఒక రేంజ్. అయితే నవతరం హీరోల పారితోషికాల రేంజ్ ఎంత? రైజింగ్ స్టార్స్ గా దూసుకొస్తున్న కుర్ర హీరోలు ఏ స్థాయిలో పారితోషికాలు తీసుకుంటున్నారు? అన్నది పరిశీలిస్తే ఓ ఐదారుగురు హీరోల సంగతి ఇలా ఉంది.
ఇప్పుడున్న హీరోల్లో స్థిరంగా హిట్లు కొట్టే హీరో నాని. అతడు ఒక్కో సినిమాకి 10 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నారు. హిట్లు స్థిరంగా వస్తున్నాయి కాబట్టి పారితోషికం అంతే స్థిరంగా ఉందట. ఆ తర్వాత రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో స్టార్ రేంజుకు ఎదిగేశాడు. అర్జున్ రెడ్డి- గీత గోవిందం- ట్యాక్సీవాలా వరుసగా బ్లాక్ బస్టర్లతో మోతెక్కించడంతో 10 కోట్ల రేంజు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని చెబుతున్నారు.
ఇక నైజాం హీరో నితిన్ ఇటీవల వరుస ఫ్లాపులతో అల్లాడుతున్నాడు. అందువల్ల అతడి స్పీడ్ కొంత తగ్గింది. నితిన్ ఒక్కో సినిమాకి రూ.5కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. స్పీడ్ తగ్గడం వల్ల తగ్గాడు కానీ లేదంటే నానీని మించి అందుకునేవాడే. బాహుబలి భళ్లాలుడిగా రానాకి వచ్చిన క్రేజు అంతా ఇంతా కాదు. పారితోషికాల గురించి చూడకుండా తెలుగు- హిందీలో డబుల్ గేమ్ ఆడుతున్న రానా తెలివిగా క్రేజీ చిత్రాల్లో ఛాన్సులు అందుకుంటున్నాడు. తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తే రూ.4-6 కోట్ల మధ్య పారితోషికం గుంజుతున్నాడట. హిందీలో పలు క్రేజీ చిత్రాలకు పారితోషికం కంటే ఫ్రెండ్షిప్ లను చూస్తాడు తెలివిగా. ఇకపోతే .. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా- తొలి ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకుని స్పీడుమీదున్నాడు. అంతరిక్షం ఫ్లాపై బ్రేక్ వేసినా అతడి కెరీర్ పై దాని ప్రభావం లేదు.
ఒక్కో సినిమాకి అతడు రూ.5కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడట. వరుణ్ స్పీడ్ పెరగడం వల్ల అప్పట్లోనే పారితోషికం పెంచాడని చెబుతున్నారు. ఇక రానా హిట్టొస్తే పెంచేస్తున్నాడని చెప్పుకున్నారు. అక్కినేని నాగచైతన్య ఫేజ్ అమాంతం మారుతోంది. ఇటీవలే మజిలీ తర్వాత ఊపొచ్చింది. ఇప్పటివరకూ రూ.3కోట్లు అన్నవాడే డబుల్ చెప్పినా చెప్పొచ్చు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక అఖిల్ కి వరుసగా నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే కాబట్టి డిమాండ్ చేసే అవకాశం లేదు. అయినా 2కోట్ల పారితోషికం అక్కినేని బ్రాండ్ తో అందుకుంటున్నాడు. హిట్టు లేక ఊపు లేదు. హిట్టొస్తే పెంచేయడం ఖాయమని చెబుతున్నారు. ఇకపోతే ఇతర యువహీరోలు పారితోషికాలు ఫిక్స్ డ్ గా లేవు. అవకాశాన్ని.. బ్యానర్ ని బట్టి గాలివాటంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే హిట్టు- ఫట్టుతో సంబంధం లేకుండా నవతరం హీరోలంతా కెరీర్ పరంగా బిజీగా ఉండడం అన్నది ఆసక్తికర పరిణామం.