టాలీవుడ్ లో యంగ్ హీరోలకు గడ్డుకాలం నడుస్తోంది. ఒక దశలో సూపర్ హిట్లు అందుకుని జోష్ తో కనిపించిన పలువురు యంగ్ హీరోలు ఇప్పుడు ఒక్క హిట్టు ప్లీజ్ అంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మారుతున్న కాలంతో పాటు వీళ్లు మారకపోవడమే ఇందుకు కారణమా? లేక సగటు ప్రేక్షకుడి నాడిని పట్టుకోలేకపోవడమే ప్రధాన కారణమా? అన్నది అంతు చిక్కడం లేదు. స్వయంకృతమో.. ఊహించని తప్పిదాలో.. లక్ ఫ్యాక్టర్ కలిసి రాకపోవడమో.. మొత్తానికి ఏదో తేడా అయితే జరిగింది. ఈ జాబితాలో యువహీరోలు ఎవరెవరు అన్నది పరిశీలిస్తే.. నితిన్- సందీప్ కిషన్- ఆది- సుధీర్ బాబు- నారా రోహిత్-అల్లరి నరేష్- నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా హిట్లు కొట్టారు.. నిలదొక్కుకున్నారు అన్నంతలోనే అసలేమైందో కానీ.. ఉన్నట్టుండి కెరీర్ డైలమా ఇబ్బంది పెడుతోంది.
త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ తో `అఆ` సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు నితిన్. ఈ సినిమాతో 50 కోట్ల క్లబ్ హీరో అనిపించుకున్నాడు కూడా. కానీ ఆ తరువాత ఆ సక్సెస్ ని చేజేతులా కిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక్క హిట్టు ప్లీజ్ అంటూ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ హోప్స్ అన్నీ `భీష్మ`పైనే. నితిన్ తరహాలోనే సందీప్ కిషన్ కి ఓ అదిరిపోయే హిట్టు కావాలి. వరుస పరాజయాలతో ఈ సందీప్ కి ఏమైంది అంటూ అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. గుడ్డిలో మెల్లలా `నిను వీడని నీడను నేనే` ఫర్వాలేదనిపించడం ఊరటనిచ్చింది. అయినా ఇప్పడతనికి ఓ సూపర్ హిట్ కావాలి. అందుకోసం కొత్త తరహా కామెడీ ఎంటర్ టైనర్ `తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆదికి ఇది పరీక్షా కాలం. బుర్రకథ- జోడీ చిత్రాల ఫలితం తీవ్రంగా నిరాశపరచడంతో `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` అయినా తనని రక్షిస్తుందేమోనని భావిస్తున్నాడు. సుధీర్ బాబుది ఇదే పరిస్థితి. తనకు ప్రస్తుత సన్నివేశంలో సరైన బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్టు కావాలి. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ పైనా.. అలాగే ఇంద్రగంటి దర్శకత్వంలోని `వీ`పైనా బాగా శ్రద్ధ పెట్టాడు. ఇవైనా ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబును సక్సెస్ బాట పట్టిస్తాయేమో చూడాలి. అల్లరి నరేష్ కెరీర్ లో ఊహించని మలుపులెన్నో. ఇటీవల మరింతగా మసకబారుతుంటే మహర్షిలో ఓ చక్కని చుక్కానీ లాంటి పాత్ర అతడిని వరించింది. అయితే పేరొచ్చినా వరుసగా సినిమాలు చేసేయడం లేదు. అల్లరోడికి ఇక సెట్స్ పై ఉన్న `బంగారు బుల్లోడు` సినిమానే ఆదుకోవాలి. ఇక యంగ్ హీరోల్లో నిఖిల్ పరిస్థితి ఎవరూ ఊహించనిది. అతని ఆశలన్నీ `అర్జున్ సురవరం`పైనే.. కానీ అది రిలీజ్ ముంగిట ఊహించని డైలమాలో పడిపోవడం నిరాశపరిచింది. అది ఎప్పుడు బయటపడుతుందో నిఖిల్ కే క్లారిటీ లేదు. ఈలోగానే చందు మొండేటితో కార్తికేయ 2కి శ్రీకారం చుడుతున్నారన్న వార్త నిఖిల్ అభిమానులకు ఊపిరి పోస్తోంది.
విలక్షణ కథల్ని ఎంచుకుని ప్రయోగాలు చేసిన నారా రోహిత్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అంటూ ఇటీవల ప్రచారమైంది. తను చేసిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం మార్కెట్ వర్గాల్లో ఇబ్బందికరంగా మారింది. అయితే అతడి నటనకు అభిమానులు ఎప్పుడూ పేరు పెట్టలేదు. మరోసారి నారా వారబ్బాయ్ రైజ్ చూస్తామనే ఆశ అభిమానులకు ఉంది. మరో ట్యాలెంటెడ్ హీరో నవదీప్ ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. అప్పుడప్పుడు హీరోగా లోబడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ ఎదుగుదల అన్నదే కనిపించలేదు. హ్యాపీడేస్ వరుణ్ సందేశ్ ఓ వెలుగు వెలిగి ఫ్లాపులతో వెనకబడ్డాడు. ఇప్పుడు బిగ్ బాస్ 3హౌస్ లో ఉన్నాడు. అతడు రీఛార్జ్ కావాల్సి ఉది. అలాగే తనీష్ పూర్తిగా తెరకు దూరమై చాలా కాలమైంది. మూవీ ఆర్టిస్టుల సంఘంలో మెంబర్ గా సేవలు అందిస్తున్నాడు. మునుముందు కొత్త అవతారంతో దిగుతాడేమో చూడాలి. మరి ఈ యంగ్ హీరోలంతా తమని తాము తిరిగి రీఎనర్జీతో రీబూట్ చేసుకునేదెపుడో చూడాలి.