సినిమా ఇండస్ట్రీతో కాస్త టచ్ ఉండి.. వెనకాల కొంచెం బ్యాలెన్స్ ఉంటే చాలు.. చాలా మంది నిర్మాతలుగా మారిపోతున్నారు. ఆ గాలి ఒక్కసారి తగిలాక మన సైడ్ నుంచి కూడా ఒక హీరో ఉంటే బావుండు అనే తరహాలో ఆలోచిస్తున్నారు. నిర్మాతల కొడుకులు పొలిటిషియన్స్ కుమారులు తెరంగ్రేటం చేసేస్తున్నారు. అలాగే అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు కూడా రీ లాంచ్ అవుతున్నారు.
గత ఏడాది ఇదే కోవకు చెందిన డజన్ మంది హీరోలుగా పరిచయమయ్యారు. ఏంజిల్ సినిమా ద్వారా నాగ్ అన్వేష్. లండన్ బాబులు సినిమాతో రక్షిత్.. ప్రేమతో మీ కార్తీక్ హీరో కార్తికేయ కథానాయకులుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎవరు అంతగా మెప్పించలేకపోయారు. అయితే వీళ్లు మరోసారి వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది కూడా మంచి కథలతో ముందుకు రాబోతున్నట్లు చెప్పేశారు.
టాలీవుడ్ లో యువ దర్శకులకు కొదవ లేదు. అందులో రాజకీయాలకు తావివ్వకుండా టాలెంట్ ఉన్న యువకులకు అవకాశం ఇస్తే మంచి హిట్టు ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెకండ్ స్టెప్ లో ఈ యువకులు ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.