పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` విడుదల వాయిదాతో ఎలాంటి సన్నివేశం ఎదురైందో తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` కారణంగా మిగతా అగ్ర హీరోల సినిమాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ వాయిదాల్ని పరిశ్రమ పెద్ద నష్టంగా భావిస్తోంది. చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఇండస్ర్టీకి అంతగా కలిసొచ్చేది ఉండదు. సరిగ్గా సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులు సైతం ఎంటర్ టైన్ మెంట్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక `ఆర్ ఆర్ ఆర్` లో నటించిన హీరోల పరిస్థితి అలాగే తయారైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా విడుదలై మూడేళ్లు అవుతుంది. అరవింద సమేత తర్వాత తారక్ సమయం మొత్తం `ఆర్ ఆర్ ఆర్` కే కేటాయించారు.
మధ్యలో ఎలాంటి కమిట్ మెంట్లు లేకుండా ఉన్న సమయాన్ని `ఆర్ ఆర్ ఆర్` కే అంకితం చేసారు. ఆ రకంగా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. తారక్ దీన్ని బోలెడంత లాస్ గాను భావిస్తున్నారు. అయితే ఇప్పుడు లాస్ ని భర్తీ చేసే పనుల్లో నిమగ్నమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఒకేసారి ఏకంగా రెండు ప్రాజెక్ట్ ల్ని ప్రారంభించి సెట్స్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇప్పటికే కొరటాల శివతో కమిట్ ఉంది. స్ర్కిప్ట్ లాక్ అయింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారుట. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా యంగ్ టైగర్ కి స్ర్కిప్ట్ లు వినిపించినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
అదే నిజమైతే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి తారక్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే బుచ్చిబాబు యంగ్ మేకర్. ఒక సినిమానే డైరెక్ట్ చేసాడు. స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం లేదు. దర్శకుడిగా ఇంకా షైన్ అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తారక్ సెకెండ్ ఆప్షన్ ప్రశాంత్ నీల్ కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఇతను పాన్ ఇండియా డైరెక్టర్ గా వెలిగిపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా భాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.